08-04-2025 12:14:06 AM
సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి ఫైర్
కరీంనగర్ ఫైర్, ఏప్రిల్ 7 (విజయక్రాంతి): కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ప్రవర్తిస్తున్న తీరు ఉట్టికి అందనోడు ఆకాశంను అందుకోవాలని చూసినట్టు ఉందని సుడా చైర్మన్,నగర కాంగ్రెస్ అధ్యక్షుడు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి ఎద్దేవా చేశారు.స్థానిక ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కరీంనగర్ అభివృద్ధి చేత కాదు కానీ ఎప్పడు ఏదో ఒక వివాదాస్పద వ్యాఖ్యలు మాట్లాడి వార్తల్లో ఉండాలని చూస్తాడని అన్నారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి,పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ పై బండి సంజయ్ కుమార్ చేసిన వాఖ్యలను ఖండించారు.బండి వాఖ్యలను చేస్తుంటే కెసిఆర్ రాసి పంపిన స్క్రిప్ట్ ను చదువుతున్నట్టు ఉందని గతంలో బండి బిజెపి అధ్యక్షుడి గా ఉన్నప్పుడు అవసరం లేకున్నా కరీంనగర్ లోని గల్లీలో ఉన్న బిజెపి ఆఫీస్ లో బండి నిరాహార దీక్ష చేపడితే నిరాహార దీక్ష చేపట్టిన రెండు గంటలకే అప్పటి కెసిఆర్ ప్రభుత్వం గ్యాస్ కట్టర్లతో ఫైర్ ఇంజన్లతో హంగామా చేశారని అదంతా బండి కి మైలేజీ రావాలని మ్యాచ్ ఫిక్సింగ్ తో జరిగినట్టు ఉందని అన్నారు.
అదే విధంగా ఇప్పుడు బండి మళ్లీ బిజెపి అధ్యక్షుడు కావాలని కెసిఆర్,బండి ఆడుతున్న నాటకంలాగా ఉందని నరేందర్ రెడ్డి మండిపడ్డారు.బిజెపిని బండి జనతా పార్టీ చేసుకో మాకు అభ్యంతరం లేదు కానీ మా నాయకుల చిత్త శుద్ధి పై మాట్లాడితే ఊరుకునేది లేదని నరేందర్ హెచ్చరించారు. రాష్ట్రంలో కులగణన చేసి బిసి రిజర్వేషన్ కు శాసన సభలో బిల్లు ఆమోదం చేపించిన ఘనత మా నాయకులదని నీకేమాత్రం చిత్త శుద్ధి ఉన్నా కేంద్ర ప్రభుత్వంచే అనుమతి ఇప్పించాలని డిమాండ్ చేశారు.
జాతీయ పార్టీ అయిన బిజెపి లో జాతీయ స్థాయిలో నిర్ణయం లేకుండానే మీకు మంత్రి పదవి వచ్చిందా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో తీసుకునే నిర్ణయాలను ప్రశ్నించడానికి మీరెవరు అని నరేందర్ రెడ్డి ప్రశ్నించారు.కాంగ్రెస్ పార్టీ తెలంగాణ వ్యవహారాల ఇంచార్జి మీనాక్షి నటరాజన్ యొక్క సింపుల్ సిటీని చూసి నేర్చుకోండి గాని అనవసరంగా విమర్శిస్తే కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు సహించరని నరేందర్ రెడ్డి హెచ్చరించారు. ఈ విలేకరుల సమావేశంలో ఎండి తాజ్, కొరివి అరుణ్ కుమార్,శ్రవణ్ నాయక్, చర్ల పద్మ,జీడీ రమేష్,సాయిరాం,గుండాటి శ్రీనివాస్ రెడ్డి,మాసుం ఖాన్,బషీర్,భారీ,వాసు,శ్రీధర్ రెడ్డి,కీర్తికుమార్ తదితరులు పాల్గొన్నారు.