calender_icon.png 18 November, 2024 | 4:06 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చంద్రుడిని పట్టుకొని చూసినట్టే..

02-09-2024 12:23:51 AM

అద్భుత ఫొటోలు తీసిన కుర్దిష్ ఫొటోగ్రాఫర్

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 1: భూమికి ఉన్న ఏకైక ఉపగ్రహం చంద్రుడి గురించి అనేక దేశాల ఖగోళ శాస్త్రవేత్తలు ఎడతెగని పరిశోధనలు చేస్తూనే ఉన్నారు. అమెరికా అక్కడికి మనుషులును పంపగా భారత్, చైనా, రష్యా వంటి దేశాలు రోవర్లను పంపాయి. ఇక ఔత్సాహిక ఫొటోగ్రాఫర్లకైతే చందమామ అత్యంత ఇష్టమైన వనరు. తాజాగా కుర్దిష్ ఫొటోగ్రాఫర్ దర్యా కవా మీర్జా అత్యంత స్పష్టంగా చందమామ ఫొటోలు తీశాడు. దాదాపు నాలుగు రోజులు ఏకబిగిన కష్టపడి చంద్రుడి ఉపరితలంపై మనం నిలబడి చూస్తే ఎంత స్పష్టంగా ఉంటుందో అంతటి స్పష్టమైన ఫొటోలు తీశాడు. ఈ ఫొటో ఏకంగా 159.7 మెగాపిక్సల్‌తోపాటు దాని సైజు 708 జీబీ ఉండటం విశేషం. దాదాపు 81 వేల ఫొటోలను కలిపి చంద్రుడి అత్యంత స్పష్టమైన తుది ఫొటోను డెవలప్ చేశాడు.