06-02-2025 01:16:32 AM
వాషింగ్టన్, ఫిబ్రవరి 5: ట్రంప్ విదేశీయుల నెత్తి మీద మరో బాంబ్ వేసేందుకు సిద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది. హెచ్ ఎల్ వీసాలను ఆటోరెన్యూవల్ చేసుకునేందుకు ఉన్న అవకాశాన్ని రద్దు చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు సమా చారం. ఇందుకు సంబంధించి ఇద్ద రు సెనెటర్లు తీర్మానం కూడా ప్రవే శపె ట్టారు.
మాజీ అధ్యక్షుడు బైడెన్ ఈ వీసాల గడువును పెంచుతూ నిర్ణయం తీసుకుని అమలు చేశారు. ఆ నిర్ణయాన్ని రద్దు చేయాలని ఇద్దరు సెనెటర్లు తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ నిర్ణయం అమలైతే విదేశీ యులకు భారీ దెబ్బే.