కౌశిక్ తీరుపై స్పీకర్ చురకలు
హైదరాబాద్, జూలై 29 (విజయక్రాంతి): శాసనసభలో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి తీరుపై స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ చురకలు అంటించారు. కౌశిక్‌రెడ్డి ధోరణి చూస్తే ఏదో యుద్ధానికి పోతున్నట్టు ఉన్నదని, సభకు వచ్చినట్టు లేదని చెప్పారు. సభకు కొత్తగా వచ్చిన సభ్యుడు సంయమనంతో ఉండాలని సూచించారు. ఈ సందర్భంగా కౌశిక్ రెడ్డి చేసిన కొన్ని వ్యాఖ్యలను తప్పుబట్టారు. కొన్ని మాటలను రికార్డుల నుంచి తొలగించారు.