యంగ్ హీరో కిరణ్ అబ్బవరం నటిస్తున్న కొత్త సినిమా ‘దిల్ రూబా’. ఈ సినిమాలో రుక్సర్ థిల్లాన్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రాన్ని శివమ్ సెల్యులాయిడ్స్, ఏ యూడ్లీ ఫిలిం సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. విశ్వకరుణ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు రవి, జోజో జోస్, రాకేశ్‌రెడ్డి, సారెగమ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.
వాలెంటైన్స్ డే సందర్భంగా ఫిబ్రవరి 14న విడుదలకు సిద్ధమవుతున్న ఈ చిత్రం నుంచి తాజాగా మేకర్స్ ఫస్ట్ సింగిల్‌గా ‘అగ్గిపుల్లె’ సాంగ్‌ను వదిలారు. ‘అగ్గిపుల్లె అలా గీసినట్టు.. కోపంగా చూడకే కొట్టినట్టు.. గాలి దుమారమే రేగినట్టు.. ఆవేశమెందుకే నొక్కిపెట్టు...’ అంటూ సాగుతోందీ మెలోడీ. సామ్ సీఎస్ సంగీత సారథ్యంలో ఈ గీతాన్ని అనురాగ్ కులకర్ణి ఆలపించగా, భాస్కరభట్ల సాహిత్యాన్ని అందించారు.