calender_icon.png 3 April, 2025 | 1:40 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆ హాలీవుడ్ డైరెక్టర్ తీసిన సినిమాలా ఉంటుంది

23-03-2025 12:18:28 AM

చియాన్ విక్రమ్ హీరోగా నటిస్తున్న తాజాచిత్రం ‘వీరధీరశూర’. డైరెక్టర్ ఎస్‌యూ అరుణ్‌కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఎస్‌జే సూర్య, సూరజ్ వెంజరాముడు, దుషార విజయన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. హెచ్‌ఆర్ పిక్చర్స్ రియాశిబు నిర్మించిన ఈ చిత్రం మార్చి 27న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో మేకర్స్ శనివారం హైదరాబాద్‌లో ప్రీరిలీజ్ ప్రెస్‌మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా హీరో విక్రమ్ మాట్లాడుతూ.. ‘మంచి రస్టిక్ యాక్షన్‌తోపాటు భావోద్వేగాలు మిళితమైన సినిమా ఇది. ఫస్ట్ షాట్ నుంచే కథ మొదలైపోతుంది.

అందుకే షో టైమ్ కన్నా ఐదు నిమిషాలు ముందే థియేటర్‌లో ఉండేలా చూసుకోవాలని ప్రేక్షకులను కోరుతున్నా’ అన్నారు. హీరోయిన్ దుషారా మాట్లాడుతూ.. ‘ఈ సినిమా కోసం అందరం చాలా హార్డ్ వర్క్ చేసాం. కచ్చితంగా ఈ సినిమా అందరికీ నచ్చుతుందని నమ్ముతున్నా’ అని తెలిపింది. ఎస్‌జే సూర్య మాట్లాడుతూ.. “హాలీవుడ్ డైరెక్టర్ మార్టిన్ స్కోర్సెస్ అంటే డైరెక్టర్ అరుణ్‌కు చాలా పిచ్చి.

ఒకవేళ మార్టిన్ స్కోర్సెస్ రాజమండ్రిలో సినిమా చేస్తే ఎలా ఉంటుందో ఈ సినిమా అలా ఉంటుంది. ‘రంగస్థలం’లాంటి రా అండ్ రస్టిక్ సినిమా ఇది. ఇందులో నా పాత్ర చాలా కొత్తగా ఉంటుంది. అరుణ్ చాలా టాలెంటెడ్ డైరెక్టర్. ఈ సినిమాలో 16 మినిట్స్ డ్యూరేషన్ గల ఒక సింగిల్ షాట్ ఉంది. ఆ షాట్ కోసం చాలా రిహారల్స్ చేశారు. ఒక రాత్రంతా ఆ షాట్ తీస్తూనే ఉన్నాం” అని చెప్పారు. ఇంకా నిర్మాత ప్రసాద్, యాక్టర్ పృథ్వీ, లిరిక్ రైటర్ రాంబాబు గోశాల తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.