- స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ తగ్గించిందే కేసీఆర్
- బీసీ సంక్షేమ సంఘం జాతీయాధ్యక్షుడు జాజుల
హైదరాబాద్, నవంబర్ 26 (విజయ క్రాంతి): బీసీ రిజర్వేషన్లపై ఎమ్మెల్సీ కల్వ కుంట్ల కవిత మాట్లాడటం విడ్డూరంగా ఉందని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ పేర్కొ న్నారు. బీసీ రిజర్వేషన్లపై మాట్లాడే నైతిక హక్కుల ఆమెకు లేదన్నారు.
మంగళవా రం సచివాలయం మీడియా పాయింట్ లో ఆయన మాట్లాడుతూ.. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ తగ్గించింది కేసీఆరేనని, రాష్ట్రంలోని చేపడుతున్న కులగణనపై ఇప్పటివరకు కేసీఆర్ స్పందించలేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. 2014లో తెలంగాణలో చేసిన సమగ్ర కుటుంబ సర్వే వివరాలను కేసీఆర్‌ను అడగాలని కవితకు సూచించారు.
బీఆర్‌ఎ స్‌కు, కవితకు బీసీలపై చిత్తశుద్ధి ఉంటే వారి పార్టీ అధ్యక్షుడిగా బీసీలకు అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేశారు. బీఆర్‌ఎస్ అధికారంలోకి వస్తే బీసీని సీఎంను చేస్తామని ప్రకటించాలని పేర్కొన్నారు. బీసీ డిమాండ్ల పట్ల బీఆర్‌ఎస్‌లోని బీసీ నేతలు మాట్లాడితే బాగుంటుందని తెలిపారు.
బీఆర్‌ఎస్ అధికారంలో ఉన్న ప్పుడు బీసీ సంక్షేమ శాఖను అగ్రకు లాలకు అప్పజెప్పారని విమర్శించారు. స్కాములలో ఉన్నోళ్లు, స్కీములు ఎగ్గొట్టి నోళ్లు బీసీల రాగం ఎత్తుకుంటే ఎలా న మ్ముతారని ప్రశ్నించారు. తెలంగాణ బీ సీలలో వస్తున్న చైతన్యాన్ని విచ్ఛిన్నం చేయడానికి కవిత రిజర్వేషన్లపై హడావిడి చేస్తున్నారని ఆరోపించారు.
పదేళ్ల బీఆర్ ఎస్ పాలనలో బీసీలు వినతిపత్రం ఇద్దా మన్నా కేసీఆర్ అపాయింట్‌మెంట్ ఇవ్వ లేదని విమర్శించారు. హైదరాబాద్‌లో పూలే విగ్రహాన్ని ఏర్పాటు చేయని వారు కూడా ఇప్పుడు ఆయన గురించి మాట్లాడటం విచిత్రంగా ఉందని దుయ్యబట్టారు. గురుకులాల్లో విద్యార్థుల చావులకు బీఆర్‌ఎస్ పార్టీనే కారణమన్నారు.