13-03-2025 01:23:38 AM
మద్రాస్ హైకోర్టు
చెన్నై, మార్చి 12: తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నించే అభ్యర్థులకు తమిళం చదవం, రాయడం తప్పనిసరిగా వచ్చి ఉండాలని మద్రాస్ హైకోర్టు స్పష్టం చేసింది. తప్పనిసరిగా ఉత్తీర్ణత సాధించాల్సిన తమిళ భాష పరీక్షలో అర్హత సాధించకపోవడం వల్ల తనను ఉద్యోగం నుంచి తొలగించారని పేర్కొంటూ తమిళనాడు ఎలక్ట్రిసిటీ బోర్డులో రెండేళ్లపాటు విధులు నిర్వర్తించిన ఎం. జయకుమార్ అనే వ్యక్తి కోర్టును ఆశ్రయించారు.
దీనిపై మద్రాస్ హైకోర్టులోని మదురై బెంచ్ తాజాగా విచారణ జరిపింది. తన తండ్రి నేవీ అధికారి కావడంతో సీబీఎస్‌సీలో చదివానని, అందువల్లే తమిళం నేర్చుకోవడానికి వీలు కాలేదని జయకుమార్ పేర్కొనగా కోర్టు తప్పుపట్టింది. తమిళం తెలియకుండా ప్రభుత్వ ఉద్యోగి రోజూవారి కార్యకలాపాలను ఎలా నిర్వహిస్తాడని ఈ సందర్భంగా కోర్టు ప్రశ్నించింది.