మహేశ్ బాబు, రాజమౌళి అభిమానులు ఎం తగానో ఎదురు చూస్తు న్న తరుణం రానే వచ్చిం ది. ఇవాళ వీరిద్దరి కాంబోలో సినిమా పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభం కానుందని సమాచారం. చిత్రబృందం నుంచి అధికారిక ప్రకటన అయితే వెలువడలేదు. వాస్తవానికి తన సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమంలో మహేశ్ పాల్గొనరు.
మరి ఈ సెంటిమెంటును ఈసారి రాజమౌళి కోసం బ్రేక్ చేస్తారో లేదో చూడాలి. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ జనవరి చివరి వారంలో మొదలవుతుందని తెలుస్తోంది. హైదరాబాద్‌లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో చిత్రీకరణ కీలక సెట్స్‌ను వేశారు. అక్కడే షూటింగ్ కూడా నిర్వహిస్తారని సమాచారం.
అలాగే రాజమౌళి కొద్ది రోజుల క్రితం లోకేషన్స్ వేటలో భాగంగా బొర్రా గుహలతో పాటు ఒడిశాలోని పలు లొకేషన్లను పరిశీలించారు. అక్కడ కూడా షూటింగ్ నిర్వహించే అవకాశం ఉంది. ఈ చిత్రం భారతీయ భాషలతో పాటు ఇతర భాషల్లోనూ విదేశీ భాషల్లోనూ అనువదించనున్నారు. ఈ చిత్రాన్ని కేఎల్ నారాయణ నిర్మిస్తున్నారు.