calender_icon.png 12 January, 2025 | 4:15 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తగ్గేదే ల్యా!

12-01-2025 01:35:51 AM

సంక్రాంతి పండుగకు వెళ్లేందుకు తెలుగు రాష్ట్రాల ప్రజలు ఫీట్లు చేస్తున్నారు. సొంతూళ్లకు వెళ్లే ప్రయాణి కులు రైళ్లు, బస్సుల కోసం పాట్లు పడుతున్నారు. బతుకుదెరువుకు నగరానికి వచ్చి పండుగకు సొంతూరుకు వెళ్దామంటే సరిపడా బస్సులు, రైళ్లు లేక అపసోపాలు పడుతు న్నారు. ప్రధాన రహదారులన్నీ వాహనాల రద్దీతో నిండిపోతున్నాయి. టోల్ ప్లాజాల దగ్గర కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోతున్నాయి.

ఇలా ట్రాఫిక్‌లోనే గంటలకొద్దీ సమయం పడుతోంది. అయినా, సొంతూళ్లకు వెళ్లేందుకు తగ్గేదిలేదని ప్రయాణికులు అంటున్నారు. ఈ ఇబ్బందులు మామూలేనని, పల్లెలకు వెళ్లాక కోడి పందేలు, కొత్త సినిమాలు, కుటుంబ సభ్యులతో, స్నేహితులతో సరదా ముచ్చట్లు, ఆటలు, పాటలు.. పిండి వంటలు, కల్లు చుక్కలు, మటన్ ముక్కల ముందు ఈ ఫీట్లన్నీ బలాదూరేనంటున్నారు. 

రమేశ్ మోతె