calender_icon.png 16 March, 2025 | 3:08 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆస్ట్రేలియాలో సినిమా తీయడం కష్టమన్నారు

16-03-2025 01:47:00 AM

సహాన ఆర్ట్స్ క్రియేషన్స్ బ్యానర్‌పై బీటీఆర్ శ్రీనివాస్ నిర్మాణ సారథ్యంలో తారకరామ దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం ‘అనగనగా ఆస్ట్రేలియాలో’. మార్చి 21 ప్రేక్షకుల ముందుకు వస్తోందీ సినిమా. ఈ నేపథ్యంలో మేకర్స్ ఈ మూవీ ట్రైలర్ లాంచ్ కార్యక్రమాన్ని నిర్వహిం చారు. ఈ సందర్భం గా రచయిత, దర్శకుడు తారకరామ మాట్లాడుతూ.. ‘ఈ చిత్ర షూటింగ్ మొత్తం ఆస్ట్రేలియాలోనే చేశాం.

నటీనటులు, సాంకేతిక నిపుణులు తెలుగువారే. మెల్‌బోర్న్ వాతావరణం చాలా వింతగా ఉంటుంది.. చాలా కష్టమైనప్పటికీ ఈ చిత్రాన్ని  122 రోజు ల్లో 83 లోకేషన్స్‌లో తీశాం. చాలా మంది స్క్రిప్ట్ చదివి ఈ చిత్రం ఇక్కడ చేయడం కష్టమన్నారు. అయినా పట్టు విడువకుండా పూర్తి చేశాం. ప్రస్తుతం కేవలం తెలుగులోనే రిలీజ్ చేస్తున్నాం’ అని చెప్పారు.