calender_icon.png 21 March, 2025 | 7:30 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉదయం ఇవి తింటే బెటర్

02-03-2025 12:00:00 AM

ఉదయం పూట మనం తీసుకునే ఆహారం.. ఆ రోజంతటికీ కావాల్సిన ఉత్సాహాన్నిస్తుంది. అందుకే ఉదయాన్నే ఏదో ఒకటి తినేద్దాం అనుకోవద్దు. తప్పనిసరిగా తినాల్సినవి కొన్ని ఉన్నాయి అంటున్నారు పోషకాహార నిపుణులు. ఉదయం పూట తీసుకునే ఆహారంలో పీచు తప్పనిసరిగా ఉండాలి.

ఇందుకోసం రాగులు, జొన్నలు, సజ్జలతో చేసిన బ్రెడ్‌లు, అటుకులు, ఓట్‌మీల్ వంటివి చక్కని ప్రత్యామ్నాయాలు. అలాగే పీచు తర్వా త మనం తప్పనిసరిగా తీసుకోవా ల్సినవి మాంసకృత్తులు. వీటికోసం పెరు గు, ఉడకబెట్టిన గుడ్లు తగిన ఆహారం. వీటి నుంచి మాంసకృత్తులతోపాటూ అత్యవసర విటమిన్లు, ఖనిజాలు కూడా అందుతాయి.

టిఫిన్ అనగానే చాలామంది ఇంట్లో చేసుకోవడం ఎందుకులే అని బయట తినేస్తే పోలా అనుకుంటారు. కానీ ఇది మంచి పద్ధతి కాదు. బయట తినే ఆహారంలో ఉప్పు, నూనెల మోతాదు ఎక్కువగా ఉంటుంది. అందుకని ఇంట్లోనే తినడం మంచిది. తాజా పండ్లు, సోయాపాలు, కాయగూరలతో చేసిన ఆమ్లెట్, బాదం, అక్రోట్ వంటి వాటిని తినొచ్చు. వీటితోపాటు బాదం వంటి ఎండు పప్పులని కూడా చేర్చుకోవచ్చు.