calender_icon.png 7 March, 2025 | 4:47 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అన్నీ గాలిమాటలే

07-03-2025 01:34:42 AM

  1. ముఖ్యమంత్రిపై కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి మండిపాటు
  2. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీది తిరుగులేని విజయం 
  3. ప్రభుత్వంపై ఎంత వ్యతిరేకత ఉందో స్పష్టమైంది 
  4. ఇకపై ‘సేవ్ తెలంగాణ, సపోర్ట్ బీజేపీ’ మా నినాదమని వెల్లడి

హైదరాబాద్, మార్చి 6 (విజయక్రాంతి) :  తెలంగాణలో బీజేపీది తిరుగు లేని విజయమని కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు  కిషన్‌రెడ్డి  అన్నారు.  రాష్ర్టంలో పాలకులు మారినా, పాలనలో ఏ మాత్రం మార్పులేదని విమర్శించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను, ప్రజ లకు ఇచ్చిన వాగ్దానాలను  ఇప్పటివరకు నిలబెట్టుకోలేని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నీ గాలి మాటలు మాట్లాడుతు న్నారని  ఆయన మండిపడ్డారు. గురువారం కిషన్‌రెడ్డి మీడియాతో మాట్లాడు తూ.

రాష్ర్టంలో ప్రభుత్వాన్ని నడుపుతున్న ముఖ్యమ్రంతిని ఎవరూ పట్టించుకోవడం లేదన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి అబద్ధాలు మాట్లాడినంత మా త్రాన ఎవరూ నమ్మడం లేదని, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై ఏ స్థాయిలో ప్రజా వ్యతిరేకత ఉందో ఎమ్మెల్సీ ఎన్నికలతో తేటతెల్లమైందదన్నారు. సీఎం స్థాయిలో ఉండి దిగజారుడు మాటలు మాట్లాడటం సరికాదన్నారు. బీజేపీకి ప్రజలు ఇచ్చిన విజయంతో తమకు బాధ్యత మరింత పెరిగిందని కిషన్‌రెడ్డి అన్నారు.

ఇక నుంచి తాము ‘సేవ్ తెలంగాణ, సపోర్ట్ బీజేపీ’  నినాదంతో ముందుకెళ్తామని అన్నారు. రాబోయే ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి రావడం పక్కా అని కిషన్‌రెడ్డి జోస్యం చెప్పారు. ఇకనైనా తెలంగాణలో డబుల్ ఇంజిన్ సర్కార్  రాకపోతే పరిస్థితులు దయనీయంగా మారే అవకాశం ఉందని అన్నారు. హైదరాబాద్ మెట్రో విస్తరణకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదానికి 10 నెలలుపడితే.. మూడు నెలల్లో కేంద్ర మంత్రివర్గం ఎట్లా ఆమోదిస్తుందో రేవంత్‌రెడ్డి చెప్పాలని కిషన్‌రెడ్డి డిమాండ్ చేశారు.

మతపరమైన రిజర్వేషన్లు తొలగించి ఎస్సీ, ఎస్టీ, బీసీలకు కలుపుతామనే మాటకు తాము కట్టుబడి ఉన్నామని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్రంలో మూడు ఎమ్మెల్సీ స్థానాలకు గాను రెండింటిని కైవసం చేసుకున్నామని.. తెలంగాణ యువత, టీచర్లు తమపై పూర్తి నమ్మకం ఉంచి తమ అభ్యర్థులను గెలిపించడం సంతోషదాయకమని కిషన్‌రెడ్డి అన్నారు. తాను మళ్లీ రాష్ర్ట అధ్యక్షుడిగా పని చేసే అవకాశం లేదని స్పష్టం చేశారు. త్వరలోనే తెలంగాణకు కొత్త అధ్యక్షుడు వస్తారని.. ప్రస్తుతం తాను పార్టీ తాత్కాలిక అధ్యక్షుడిగానే కొనసాగుతున్నానని ఆయన స్పష్టం చేశారు.