calender_icon.png 5 January, 2025 | 8:32 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అందరికీ పరీక్షే!

03-01-2025 12:50:38 AM

  1. ప్రభుత్వ బడుల్లో పూర్తికాని పదో తరగతి సెలబస్
  2. ముంచుకొస్తున్న వార్షిక పరీక్షలు
  3. కొత్త ఉపాధ్యాయులు, కొత్త ఎంఈవోలు
  4. గతేడాది కంటే మెరుగైన ఫలితాలే లక్ష్యం

మెదక్, జనవరి ౨ (విజయక్రాంతి): మెదక్ జిల్లాలో ఉపాధ్యాయ బదిలీలు, పదోన్నతులు, నూతన ఉపాధ్యాయుల భర్తీ ప్రక్రియ వల్ల ఇప్పటివరకు పలు పాఠశాలల్లో పదో తరగతి సిలబస్ పూర్తి కాలేదు.

ఈ నేపథ్యంలో ఈసారి విద్యార్థులే కాకుండా జిల్లా అధికారులు, విద్యాశాఖ అధికారులు, హెచ్ ఎంలు, స్కూల్ అసిస్టెంట్లు కూడా పరీక్షలను సమర్థవంతంగా ఎదుర్కోవాల్సిన పరిస్థితి నెలకొంది. త్వరగా సిలబస్ పూర్తిచేసి ప్రత్యేక కార్యాచరణతో విద్యార్థులను పరీక్షలకు సం సిద్ధం చేయాల్సిన అవసరం ఉంది. 

అంతా కొత్తగానే..

ఈ విద్యా సంవత్సరంలో ఉపాధ్యాయుల పదోన్నతులు, బదిలీలతో పాటు కొత్తగా ఉపాధ్యాయులను భర్తీ చేశారు. దీంతో ఎక్కువ శాతం పాఠశాలల్లో హెచ్‌ఎం, స్కూ  అసిస్టెంట్లు బదిలీ అయ్యారు. దీనికి తోడుగా పదోన్నతుల్లో భాగంగా 563 మం  సెకండరీ గ్రేడ్ టీచర్లు పదోన్నతి పొంది స్కూల్ అసిస్టెంట్లుగా ఉన్నత పాఠశాలలకు వచ్చారు.

ఇలా పదో తరగతికి పాఠం బోధిం  ఉపాధ్యాయులు, పాఠశాలలను పర్యవేక్షించే ప్రధానోపాధ్యాయులు కొత్తవారు అంత కొత్తవారు కావ  గమనార్హం. దీంతో డిసెంబర్ వరకు పూర్తి కావాల్సిన సిలబస్ ఇప్పటికీ పలు పాఠశాలల్లో పూర్తి స్థాయిలో కంప్లీట్ కాలేదని విద్యార్థుల తల్లిదండ్రులు చెబుతున్నారు.

అదేవిధంగా జిల్లాలో 19 కస్తూర్బా  బాలికల పాఠశాలలు ఉండగా అందులో పనిచేస్తున్న టీచర్లలో కొందరికి ఇతర ఉద్యోగాలు రావడంతో వారు వెళ్లిపోయారు. మరికొందరు బదిలీల్లో భాగంగా మరో పాఠశాలకు వెళ్లారు. దీంతో సబ్జెక్టు టీచర్లు ఖాళీగా ఉన్న కేజీబీవీల్లో ఆయా సబ్జెక్టులు చెప్పేవారు లేక పుస్తకాలు తెరవలేదని, వేరే సబ్జెక్టు టీచర్లు మొక్కుబడిగా చెప్పినా అర్థం కావడం లేదని విద్యార్థులు వాపోతున్నారు. 

మొదలైన టెన్షన్..

వివిధ కారణాలతో పూర్తికాకపోవడంతో విద్యాశాఖలో ఇప్పటి నుంచి పదో తరగతి ఉత్తీర్ణత టెన్షన్ మొదలైంది. జిల్లాలో ప్రభు  లోకల్ బాడీ పాఠశాలలు 897, కేజీబీవీలు 19, మోడల్ స్కూళ్లు 7, మొత్తంగా 1,067 పాఠశాలలున్నాయి. ఆయా పాఠశాలల్లో 1,21,776 మంది విద్యార్థులు చదువు  ఇందులో 225 ఉన్నత పాఠశాలల్లో 10,389 మంది విద్యార్థులు పదో తర  పరీక్షలు రాయనున్నారు.

కాగా కొత్తగా బాధ్యతలు తీసుకున్న ఎంఈవోలపై పదో తరగతిలో మెరుగైన ఫలితాలు తీసుకురావాల్సిన బాధ్యత ఉంది. అయితే పీజీ హెచ్  లే ఎంఈవోలు కావడంతో తాము పనిచేస్తు న్న పాఠశాలలను చక్కబెడుతూ మెరుగైన బోధన జరిగేలా చూడాలి. అలాగే కొత్తగా పదోన్నత పొం దిన ఎస్‌ఏలకు బోధన కొత్త కాకపోయినా ఉన్నత తరగతులకు బోధించాలంటే ముం దుగా వారు పుస్తకాలతో కుస్తీ పట్టాల్సి వస్తోంది. 

ప్రణాళికతో ముందుకెళ్తున్నాం

పదో తరగతిలో మెరుగైన ఫలితాలు సాధించేందుకు ప్రత్యేక ప్రణాళి కతో ముందుకెళ్తున్నాం. ఇందుకోసం అన్ని విభాగాలకు చెందిన హెచ్‌ఎంలతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఉ దయం, సాయంత్రం ప్రత్యేక తరగతులు నిర్వహించనున్నాం. ప్రత్యేక పరీ క్షలు చేపట్టి గతం కన్నా మంచి ఫలితాలు సాధించేలా కృషి చేస్తున్నాం. 

  రాధాకిషన్, జిల్లా విద్యాధికారి, మెదక్