calender_icon.png 10 January, 2025 | 12:42 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

శుభాకాంక్షలు చెప్పడమే పాపమైంది

03-01-2025 12:10:55 AM

  • తమ కూతురికి విషెస్ చెప్పినందుకు బాలుడిపై తల్లిదండ్రుల దాడి
  • మనస్తాపంతో ఉరేసుకున్న బాలుడు
  • సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలంలో ఘటన

రాజన్న సిరిసిల్ల, జనవరి 2 (విజయక్రాంతి): తోటి విద్యార్థినికి నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పడమే ఓ బాలుడి చావుకు కారణమైంది. తమ కూతురికి విషెస్ చెబుతావా అంటూ అమ్మాయి తల్లిదండ్రులు దాడి చేయగా, మనస్తాపానికి గురైన బాలుడు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన సిరిసిల్ల జిల్లా గంభీ రావుపేట మండలంలో జరిగిం ది. పోలీసులు, బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన భీముని మల్లారెడ్డిపేట గ్రామానికి చెందిన చింత కింది శివ కిశోర్ (16) పదో తరగతి చదువుతున్నాడు.

న్యూ ఇయర్ సందర్భంగా అదే గ్రామానికి చెందిన తోటి విద్యార్థినికి శుభాకాంక్షలు తెలిపాడు. దీంతో ఆమె కుటుంబ సభ్యులు శివకిశోర్‌ను ఇంటికి పిలిపించి చితకబాదారు. దీనికి తోడు విద్యార్థిని తల్లి కిశోర్ తల్లిని సైతం మందలించింది. దీంతో మనస్తాపం చెందిన శివకిశోర్ బుధవారం సాయంత్రం ఉరేసుకున్నాడు.

ఎంతకీ గది నుంచి బయటకు రాకపోవడంతో తలుపులు బద్ధలు కొట్టి తెరిచి చూడటంతో శవమై కనిపించాడు. తన కొడుకు మృతికి కారణమైన వాళ్లపై కఠిన చర్యలు తీసుకొని తనకు న్యాయం చేయాలని శివ కిశోర్ తల్లి సునీత స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. శివకిశోర్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సిరిసిల్ల ఏరియా ఆసుపత్రికి తరలించారు.