08-04-2025 12:00:00 AM
ఎమ్మెల్యే అనిల్ జాదవ్
ఆదిలాబాద్, ఏప్రిల్ 7 (విజయక్రాంతి): కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీని విస్మరించిందని, నవ వధువులకు తులం బంగారం సాధ్యం కాదని చెప్పి ఎగ్గొట్టడం సిగ్గు చేటు అని బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ అన్నారు. గుడిహత్నూర్ మండల కేంద్రంలో తహశీల్దార్ కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన చెక్కుల పంపిణీ కార్యక్రమానికి ఎమ్మె ల్యే ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా మండలంలోని ఆయా గ్రామాలకు చెందిన 50 మంది లబ్ధిదారులకు రూ. 1,00,116/- చొప్పున రూ. 50 లక్షల విలువ గల చెక్కులను అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే అనిల్ మాట్లాడుతూ అమాయకు లు కాంగ్రెస్ నమ్మి ఓటేశారని వారిని మో సం చేయకుండా తులం బంగారం అందజేయాలన్నారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్ మం డల నాయకులు, అధికారులు పాల్గొన్నారు.