calender_icon.png 4 April, 2025 | 8:32 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

2017లోనే ఐటీఐఆర్ నిలిపివేత

25-03-2025 12:50:59 AM

ఎంపీ చామల ప్రశ్నకు కేంద్రమంత్రి జితిన్ ప్రసాద్ సమాధానం

హైదరాబాద్, మార్చి 24 (విజయక్రాం తి): ఐటీఐఆర్(ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్వెస్ట్‌మెంట్ రీజియన్) ప్రాజెక్టు పునరుద్ధరణ కోసం తెలంగాణ ప్రభుత్వం నుంచి ప్రతిపాదనలు వచ్చాయా..? అని కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి మూడు రోజుల కింద లోక్‌సభలో అడిగిన ప్రశ్నకు సంబంధిత శాఖ మంత్రి జితిన్ ప్రసాద్ సోమవారం సమాధానమిచ్చారు.

ఈ ప్రాజెక్టు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనే కేంద్రం పరిశీలనలో ఉంద ని, 2013లో ఆమోదం లభించిందని పేర్కొన్నారు. 2008 ఐటీఐఆర్ పాలసీలో భాగం గా ఐటీ, మాన్యుఫ్యాక్చరింగ్ రంగాల్లో  హైదరాబాద్‌ను అభివృద్ధి చేసే ఉద్దేశంతో 2013 లో అప్పటి కేంద్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టును ఆమోదించిందని వివరించారు.

2017లో దాన్ని కేంద్రం నిలిపివేసిందని ఆయన వెల్లడించారు. ఐటీ, ఎలక్ట్రానిక్స్, మాన్యుఫ్యా క్చరింగ్ రంగాల్లో పెట్టుబడులను ఆకర్షించడానికి ప్రపంచస్థాయి మౌలిక వసతులు కల్పించేందుకు కేంద్రం ఈఎంసీ2.0 పథకాన్ని నోటిఫై చేసిందని, ఈ పథకం కింద తెలంగాణలోని నాలుగు ప్రాంతాలను ఎంపికచేసినట్లు చెప్పారు. వాటిలో కొంగరకలా న్‌లో ఈసిటీ, మహేశ్వరం, రాయదుర్గంలోని నాలెడ్జ్ సిటీ, మహబూబ్‌నగర్ జిల్లా దివిటిపల్లి ఉన్నట్లు కేంద్ర మంత్రి తెలిపారు.