calender_icon.png 28 October, 2024 | 12:06 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నదిలో దూకేందుకు యత్నించిన మహిళ.. కాపాడిన ఇటిక్యాల పోలీసులు

24-07-2024 02:26:45 PM

గద్వాల (వనపర్తి ) (విజయక్రాంతి ): కుటుంబ కలహాలతో బీచుపల్లి పుష్కర ఘాట్ దగ్గరకు వచ్చి నదిలో దూకి చనిపోయేందుకు యత్నించిన వనపర్తి జిల్లా కు చెందిన మహిళను గద్వాల జిల్లా ఇటిక్యాల మండల పోలీస్ బ్లూ కొల్ట్స్ సిబ్బంది రక్షించి కౌన్సిలింగ్ చేసి వారి కుటుంబ సభ్యులకు అప్పగించారు. వనపర్తి జిల్లా గోపాల్ పేట మండలానికి  చెందిన మహిళ , వయసు 26 సం రాలు, కుటుంబ కలహాలతో జీవితం పై విరక్తి చెంది బుధవారం ఉదయం ఇటిక్యాల మండలంలోని బీచూపల్లి పుష్కర ఘాట్ కు వచ్చి నదిలో దూకేందుకు ప్రయత్నించగా అక్కడే విధులలో ఇటిక్యాల బ్లూ కోర్ట్స్ సిబ్బంది శ్రీనివాస్, వరద రాజులు ఆమెను గుర్తించి నదిలోకి వెళ్లకుండా అడ్డుకొని ఎర్రవల్లి లోని పోలీస్ ఔట్ పోస్టు నందు కొన్సిలింగ్ చేసి అనంతరం వారి కుటుంబ సభ్యులను పిలిపించి వారికి అప్పగించడం జరిగింది. తక్షణమే బ్లూ కోల్ట్స్ సిబ్బంది స్పందించి మహిళ ప్రాణాలను కాపాడటం పట్ల గద్వాల జిల్లా ఎస్పీ టి.శ్రీనివాస రావు బ్లూ కోల్ట్స్ సిబ్బందిని అభినందించారు.