calender_icon.png 4 October, 2024 | 10:55 AM

హుజూర్‌నగర్‌కు ఐటీఐ మంజూరు

04-10-2024 12:00:00 AM

  1. భవన నిర్మాణానికి రూ.14.35 కోట్లు విడుదల
  2. ఐదు కోర్సుల్లో 216 మందికి అవకాశం
  3. ప్రిన్సిపల్ సహా 8 పోస్టుల మంజూరు

హైదరాబాద్, అక్టోబర్ 3 (విజయక్రాంతి)/సూర్యాపేట: హుజుర్‌నగర్ నియో జకవర్గ అభివృద్ధిలో భాగంగా ఎంతో కాలం నుంచి డిమాండ్‌లో ఉన్న పారిశ్రామిక శిక్షణా సంస్థ (ఐటీఐ) మంజూరైంది. దీనికి సంబంధించి గురువారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ఐటీఐ శాశ్వత భవన నిర్మాణానికి మంత్రి ఉత్తమ్‌కుమారెడ్డి రూ.14.35 కోట్ల నిధులను విడుదల చేయించారు.

ఎలక్ట్రిషియన్, ఫిట్టర్, డ్రాఫ్ట్స్ మెన్, డీజిల్ మెకానిక్‌తోపాటు వెల్డర్ కోర్సుల్లో శిక్షణ నిమిత్తం ప్రారంభిస్తున్న ఈ నూతన ఐటీఐతో హుజుర్‌నగర్ ప్రాంత నిరుద్యోగులకు ప్రయోజనకారిగా మారనున్నది. మొత్తం ఐదు కోర్సుల్లో 216 మంది విద్యార్థులతో ప్రారంభం కానున్న ఈ ఐటీఐకి ప్రిన్సిపల్ సహా 8 పోస్టులను మంజూరయ్యాయి.

గతంలో తాను మం జూరు చేయించిన అడ్వాన్డ్స్ ట్రైనింగ్ సెంటర్ సమీపంలో రామస్వామి గుట్ట వద్ద కొత్తగా మంజూరైన ఐటీఐని నెలకొల్పనున్నట్టు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. హుజుర్‌నగర్‌కు ఐటీఐ మంజూరు చేయడం పట్ల సీఎం రేవంత్‌రెడ్డికి మంత్రి ఉత్తమ్ కృతజ్ఞతలు తెలిపారు.