calender_icon.png 20 January, 2025 | 8:18 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హెల్త్ ఫీచర్స్‌తో ఇటెల్ ఐకాన్ స్మార్ట్ వాచ్

07-12-2024 02:25:47 AM

హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 6 (విజయక్రాంతి): దేశంలో ప్రముఖ టెక్నాలజీ బ్రాండ్ అయిన ఇటెల్ కంపెనీ ఫిట్‌నెస్, ఫ్యాషన్ ప్రపంచానికి ఆధునిక డిజైన్లతో ఐకాన్ స్మార్ట్ వాచ్‌లను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ వాచ్‌లో ఆరోగ్యానికి సంబంధించిన ఫిట్‌నెస్, జీవనశైలిని రూపొందించుకునే అవకాశం ఉన్నట్టు కంపెనీ ప్రతినిధులు శుక్రవారం వెల్లడించారు.

ప్రమోషన్‌లో భాగంగా ప్రత్యేక కాలపరిమితితో ఇటెల్ 70శాతం తగ్గింపుతో ఈ వాచ్‌లను అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లలో కేవలం రూ.1,699కే అందుబాటులో ఉంచినట్టు సంస్థ ప్రకటించింది. సింగిల్ -చిప్ బ్లూటూత్ కాలింగ్, మెనూ యాక్సెస్ చేయడానికి రొటేటబుల్ క్రౌన్, పవర్ బటన్‌గా సైడ్ కీ వంటి ఫీచర్లు వినియోగదారులకు మరింత సౌకర్యవంతంగా ఉండనున్నాయి.