calender_icon.png 15 January, 2025 | 4:41 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గిరిజనుల అభివృద్ధి కోసమే ఐటీడీఏలు

14-07-2024 05:32:20 AM

జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు జాటోత్ హుస్సేన్ నాయక్

భద్రాద్రి కొత్తగూడెం, జూలై 13(విజయకాంత్రి) : మారుమూల ప్రాంత గిరిజనుల సంక్షేమానికి, పిల్లల విద్యాభివృద్ధికే సమీకృత గిరిజన అభివృద్ధి సంస్థలు (ఐటీడీఏ) ఏర్పాటుచేశారని జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు జాటోత్ హుస్సేన్‌నాయక్ అన్నారు. శనివారంభద్రాద్రి జిలా సారపాకలోని ఐటీసీ కర్మాగారాన్ని, భద్రాచలంలోని ఐటీడీఏ, పాల్వంచలోని నవభారత్ కంపెనీలో పర్యటించారు. గిరిజన చట్టాల అమలు తీరు ను, గిరిజనుల సంక్షేమానికి చేస్తున్న కార్యక్రమాలను పరిశీలించారు. ఈ ఈసందర్బంగా ఐటీడీఏలో మాట్లాడుతూ.. గిరిజన గ్రామా ల్లో విద్య, వైద్యం, రహదారి సౌకర్యం తప్పనిసరిగా ఉండేలా అధికారులు శ్రద్ధ వహిం చాలని ఆదేశించారు. పెండింగ్‌లో ఉన్న సమస్యలను పరిష్కరించి పది రోజుల్లో నివేదిక అందజేయాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో ట్రైకార్ జీఎం శంకర్‌రావు, ఏపీవో జనరల్ డేవిడ్ రాజ్, భద్రాచలం ఆర్డీవో దామోదర్‌రావు, డీడీ ట్రైబల్ వెల్ఫేర్ అధికారి మణెమ్మ తదితరులు పాల్గొన్నారు.