17-02-2025 08:38:59 PM
మణుగూరు (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం సింగిరెడ్డిపల్లి పంచాయతీ మద్దులగూడెం గ్రామంలోని రామాంజనేయపురం జిపిఎస్ (టిడబ్ల్యూ) పాఠశాల సమస్యలపై ఐటీడీఏ ప్రాజెక్ట్ ఆఫీసర్ కి విద్యార్థుల తల్లిదండ్రులు సోమవారం వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా వారు సమస్యలను ఉపయోగకు వివరించారు. పాఠశాలలో 74 మంది గిరిజన విద్యార్థులు విద్యానభ్యసిస్తున్నారని, వీరికి కేవలం ఒక్కటే తరగతి గది ఉండడంతో మధ్యాహ్నం సమయంలో ఒకే గదిలో అందరూ సరిపోక బయట చెట్ల కింద కూర్చొని అన్నం తింటున్నారని తెలిపారు.
74 మంది విద్యార్థులు ఉన్న పాఠశాలలో ముగ్గురు ఉపాధ్యాయులు ఒకే గదిలో చదువు చెప్పడం ద్వారా బోధనకు అంతరాయం కలగడం లాంటి మొదలైన సమస్యలు ఎదుర్కొంటున్నారన్నారు. పాఠశాలకు అదనపు తరగతి గదిని మంజూరు చేయగలని ఐటీడీఏ ప్రాజెక్ట్ ఆఫీసర్ కోరారు. స్పందించిన పీ ఓ వెంటనే డిఈ, ఏఈలకు ఆదేశాలిచ్చారు. డిఈ, ఏఈలు పాఠశాలను పరిశీలించారు. శిథిలావస్థలో ఉన్న పాఠశాలను పరిశీలించిన ఇంజనీరింగ్ అధికారులు మరొక పాఠశాల బిల్డింగు మంజూరు చేసే విధంగా వాస్తవ పరిస్థితులను పేర్కొంటూ నివేదికను పిఓకు పంపిస్తామన్నారు. వినతి పత్రం అందజేసిన వారిలో పాఠశాల విద్యార్థుల తల్లిదండ్రులు, గ్రామస్తులు, ఉపాధ్యాయులు ఉన్నారు.