calender_icon.png 19 January, 2025 | 4:27 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రంగు రంగుల విద్యుత్ దీపాలతో మ్యూజియంను సుందరీకరించండి

18-01-2025 09:21:17 PM

భద్రాచలం,(విజయక్రాంతి): మ్యూజియం సందర్శించడానికి వచ్చే పర్యాటకులకు రాత్రిపూట విద్యుత్ కాంతులతో వెదజల్లేలా ముఖ్యంగా పర్యాటకులు సెల్ఫీలు దిగే చోట తప్పనిసరిగా ఫోకస్ లైట్లు అమర్చాలని ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి బి. రాహుల్(ITDA Project Officer B. Rahul) అన్నారు. శనివారం రాత్రి ఐటీడీఏ ప్రాంగణంలోని ట్రైబల్ మ్యూజియం(Tribal Museum) సందర్శించి మ్యూజియంలోని పాతకాలపు గృహాలు, ప్రాంగణము చుట్టు సెల్ఫీ పాయింటు క్రీడా స్థలాలలో ఏర్పాటు చేసిన విద్యుత్ లైట్లను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... పర్యాటకులు మ్యూజియం సందర్శించినప్పుడు తప్పనిసరిగా సెల్ఫీలు దిగడానికి పాతకాలపు వస్తువులు చూడడానికి కుతూహల పడతారని దానికి తగ్గట్లు విద్యుత్ దీప అలంకరణ ఉండాలని అన్నారు.

మ్యూజియం చుట్టూ మల్టీ కలర్ లైట్లు ఏర్పాటు చేయాలని, అలాగే పిల్లలకు మైండ్ సెట్ కి సంబంధించిన క్రీడల పరికరాలు అమర్చాలని, స్వాగత ద్వారా పక్కన ఉన్న ఖాళీ స్థలంలో పర్యాటకులు తీసుకొని వచ్చే వాహనాలను పార్కింగ్ ప్లేస్ గా తయారు చేయాలని, దేవస్థానం పక్కన ఉన్న ఖాళీ స్థలంలో అందంగా డిజైన్ చేసి ట్రైబల్ మ్యూజియం బోర్డు రాయించాలని మరియు మ్యూజియంలోపల ఖాళీగా ఉన్న ప్రదేశం లో కల్చరల్ ప్రోగ్రామ్స్ సంబంధించిన కార్యక్రమాలు నిర్వహిస్తున్నందున అక్కడ కూడా మల్టీ కలర్ లైట్లు ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. విద్యుత్ దీప అలంకరణ ఏర్పాట్ల విషయంలో అశ్రద్ధ చేయవద్దని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏసీఎమ్ఓ రమణయ్య, ఏటీడీఓ అశోక్ కుమార్, డిఈ హరీష్, జేడీఎం హరికృష్ణ, మ్యూజియం నిర్వాహకుడు వీరాస్వామి తదితరులు పాల్గొన్నారు.