బెల్లంపల్లి (విజయక్రాంతి): కాసిపేట మండలంలోని పెద్దాపూర్ గ్రామంలో గురువారం జిల్లా వైద్య శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వైద్య శిబిరాన్ని ఐటిడిఎ పిఓ కుష్బూ గుప్త ప్రారంభించారు. గిరిజన గ్రామాల్లో వైద్య శిబిరాలు ఏర్పాటుచేసి ఆదివాసి ప్రజలకు మెరుగైన వైద్య సేవలందించాలని వైద్యులకు సూచించారు. ఎలాంటి సమస్యలు ఉన్న ఐటీడీఏ దృష్టికి తీసుకువస్తే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో సౌకర్యాలు కల్పిస్తామని చెప్పారు. ఆదివాసీలు ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అనంతరం 85 మందికి వైద్య శిబిరంలో పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి డాక్టర్ హరీష్ రాజ్, అదనపు వైద్యాధికారి డాక్టర్ మనోహర్ ఉట్నూరు డాక్టర్ సుధాకర్ నాయక్, వైద్యాధికారులు డాక్టర్ అనిత, డాక్టర్ ప్రసాద్, డాక్టర్ భీష్మ, డాక్టర్ వేద వ్యాస్, డాక్టర్ శ్రీనివాస్, డాక్టర్ రవి కిరణ్, డాక్టర్ దివ్య, అల్లాడి శ్రీనివాస్, నాందేవ్, వెంకటేశ్వర్లు, జిల్లా మాస్ మీడియా అధికారి బుక్కా వెంకటేశ్వర్లు, డాక్టర్ శివ ప్రతాప్, ఐటీడీఏ పర్యవేక్షకులు నాందేవ్, శిరీష్ తదితరులు పాల్గొన్నారు.