భద్రాద్రి కొత్తగూడెం,(విజయక్రాంతి): పాల్వంచలోని కేటీపీఎస్ కాలుష్య ప్రభావిత ప్రాంతాల్లో ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి బి రాహుల్ శుక్రవారం పర్యటించారు. కాలుష్య ప్రభావిత ప్రాంతాలైన కరకవాగు పుల్లయ్య గూడెం పునుకుల సూరారం గిరిజన గ్రామాలను ఆయన సందర్శించి కేటీపీఎస్ నుండి వెలువడుతున్న బూడిదను తరలించుటకు దరఖాస్తులు చేసుకున్న గ్రామస్తులతో మాట్లాడారు. ఆయా గ్రామాల్లో కాలుష్య ప్రభావం ఏం మేరకు ఉందని స్థానికులను అడిగి తెలుసుకున్నారు అనంతరం ఆయన మాట్లాడుతూ బోడెదను తరలించడానికి ఈ నాలుగు గ్రామాల ప్రజలు దరఖాస్తులు సమర్పించారన్నారు. కానీ ఐటిడి అధికారులు కేటీపీఎస్ అధికారులు గ్రామస్తుల అనుభవం ఉన్నవారితో ప్రత్యేక సమావేశం నిర్వహించి కమిటీని ఏర్పాటు చేయాలన్నారు.
ఆ కమిటీలు 8 మందిని ఒక గ్రూపుగా ఏర్పాటు చేసి జనాభా ప్రాతిపదికన బోడిదను తరలించడానికి పిటిషన్ దారుల సమక్షంలో సొసైటీ ఏర్పాటు చేస్తామన్నారు. అనుభవం ఉన్నవారికి మాత్రమే అవకాశం కల్పిస్తామన్నారు. ఏదైనా సొసైటీ సభ్యులు అధికారుల సమక్షంలో నిర్ణయం తీసుకున్న తర్వాతనే బూడిదలను తరలించే బాధ్యతను అప్పగిస్తామని స్పష్టం చేశారు. దరఖాస్తు చేసుకున్న గిరిజనులు తప్పకుండా అనుభవం ఉన్న వారిని ఎంచుకొని త్వరలో ఏర్పాటు చేసే సమావేశానికి హాజరు కావాలన్నారు. అందరి సమక్షంలో సొసైటీ సభ్యులలో ఒకరిని చైర్మన్గా ఎన్నుకొని జాయింట్ అకౌంట్ ఓపెన్ చేసి గ్రామంలోని జనాభాను బట్టి ఎస్ తరలించే బాధ్యత అప్పగిస్తామన్నారు. ఐటీడీఏ పీవో వెంట సహాయ ప్రాజెక్టు అధికారి డేవిడ్ రాజ్ కేటీపీఎస్ 5,6 దశల సీఈ ప్రభాకర్ ఏడవ దశ సీఈ వెంకటేశ్వర్లు, ఎస్ఈ చలపతి రావు, డీఈలు, ఏఈలు పాల్గొన్నారు.