calender_icon.png 22 October, 2024 | 4:56 AM

భూక్య శ్రీవిద్య తోటి విద్యార్థులకు స్ఫూర్తిదాయకం: ఐటీడీఏ పీఓ రాహుల్

21-10-2024 09:28:18 PM

భద్రాద్రి కొత్తగూడెం,(విజయక్రాంతి): గిరిజన సంక్షేమ శాఖ బాలిక ఆశ్రమ పాఠశాలలో విద్యాభ్యాసం చేసి నీట్ ఎంట్రన్స్ పరీక్షలో రాష్ట్రస్థాయిలో 650 ర్యాంకు సాధించి ఎంబిబిఎస్ లో సీటు పొందిన భూక్య శ్రీవిద్య తోటి విద్యార్థినీలకు స్ఫూర్తి దాయకమని ఐటిడిఏ ప్రాజెక్ట్ అధికారి రాహుల్ అన్నారు. సోమవారం తన ఛాంబర్ లో ఏన్కూరు మండలం రేపల్లెవాడ గ్రామానికి చెందిన శ్రీ విద్య నీట్ పరీక్ష రాసి 650 ర్యాంకు తో ఎస్టీ కోటాలో మెడిసిన్ లో సీటు సాధించి దన్నారు. వరంగల్ కాకతీయ వైద్య కళాశాలలో సీటు పొందటం పట్ల హర్షం వ్యక్తం చేశారు.

శ్రీవిద్య ఒకటవ తరగతి నుంచి పదవ తరగతి వరకు బూర్గంపాడులోని సంక్షేమ ఆశ్రమ పాఠశాల బాలికలు, ఇంటర్మీడియట్ ఖమ్మం చైతన్య జూనియర్ కాలేజీలో విద్యను అభ్యసించారన్నారు. నీట్ పరీక్షలో తన ప్రతిభను కనబరిచి మెడిసిన్ లో సీటు సాధించటం జరిగింది. నిరుపేద గిరిజన రైతు కుటుంబంలో జన్మించిన ఆమెకు ప్రోత్సాహకంగా రూ 50 వేల రూపాయలు అందజేయడం జరిగిందన్నారు. తండ్రి ముఖ్య వర్మ తల్లి మంగళ వ్యవసాయ పనులు చేసుకుంటూ తన కూతుర్ని ఉన్నత విద్యలకు ప్రోత్సహించటంతో వారని అభినందించారు. ఈ కార్యక్రమంలో సహాయ ప్రాజెక్టు అధికారి జనరల్ డేవిడ్ రాజ్ పాల్గొన్నారు.