calender_icon.png 1 April, 2025 | 6:50 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసిన ఐటీడీఏ పీవో రాహుల్

30-03-2025 07:11:25 PM

భద్రాచలం (విజయక్రాంతి): ఏజెన్సీ ఏరియాలోని ఆదివాసి గిరిజన కుటుంబాలకు, గిరిజన విద్యార్థిని, విద్యార్థులకు సేవలందిస్తున్న వివిధ కార్యాలయాల్లో, ఐటీడీఏ కార్యాలయంలో పనిచేయుచున్న ముస్లిం అధికారులకు, సిబ్బందికి రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలుపుతున్నట్లు ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి బి. రాహుల్ ఒక ప్రకటనలో తెలిపారు. ఆదివారం తన చాంబర్ నుండి సోమవారం జరుపుకునే రంజాన్ పండుగ తమ కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా జరుపుకోవాలని ఆయన తెలుపుతూ, ముస్లిం కుటుంబాలు ధనిక, బీద అని తేడా లేకుండా రంజాన్ పండుగ సందర్భంగా నెల రోజులు పాటు కఠినమైన ఉపవాసాలతో ఉండి ఆచరించే పిత్రా, జకార్త్ వంటి నియమాలు పేదవాడి ఆకలిని శ్రమను గుర్తు చేసేవని, తన సంపాదనలో కొంత భాగాన్ని పేదల ఆకలి తీర్చేందుకు కేటాయించడం ఎంతో గొప్ప విషయమని, మహమ్మద్ ప్రవక్త బోధనలు ప్రపంచ మానవాళికి సుచరణీయమని, ప్రతి ఒక్కరూ ఆయన చూపిన శాంతి మార్గంలో పయనించి శాంతిని నెలకొల్పేందుకు కృషి చేయాలని తెలుపుతూ మరి ఒకసారి రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలుపుతున్నానని ఆయన అన్నారు.