ఇల్లందు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు నియోజకవర్గంలోని టేకులపల్లి మండలంలో భద్రాచలం ఐటిడిఏ ప్రాజెక్ట్ అధికారి బి రాహుల్ మంగళవారం పర్యటించారు. ఎం ఎస్ ఎం పథకం అమల్లో భాగంగా ఐటిడిఏ భద్రాచలం నుంచి మంజూరైన పథకాల పర్యవేక్షణలో భాగంగా టేకులపల్లి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన సఖి సానిటరీ నాప్కిన్ యూనిట్ను భద్రాచలం ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి బి.రాహుల్ సందర్శించి పలు సూచనలు ఆదేశాలు ఇచ్చారు. మిషనరీ ఎక్కడ కొనుగోలు చేసింది రోజుకి ఎన్ని ఉత్పత్తి తయారీ అవుతుంది, ఎక్కడ అమ్ముతారు, మార్కెటింగ్ సౌకర్యాలు ఇప్పటివరకు చూసుకున్నారా, అనేది సభ్యులను అడిగి తెలుసుకున్నారు.
భవిష్యత్తులో ఇంకా ఎలాంటి సహకారం అవసరం ఉంటుందో సభ్యులను అడిగి తెలుసుకున్నారు. తదుపరి బోడులో ఏర్పాటు చేసిన పేపర్ బ్యాగుల తయారీ కేంద్రాన్ని సందర్శించి పది రోజుల్లో యూనిట్ స్టార్ట్ అయ్యే విధంగా ప్రణాళిక చేసుకోవాలని లేని ఎడల వారికి మరో జీవనోపాధి ఎంచుకొని యూనిట్ ని స్టార్ట్ చేసే విధంగా ప్రణాళిక చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏపిఎం రవికుమార్, జెడియం హరి, సిసి శ్రీలత, సునీల్ గ్రూప్ సభ్యులు గౌసియా, పుల్లమ్మ, కరుణ తదితరులు పాల్గొన్నారు.