26-02-2025 06:20:42 PM
భద్రాచలం (విజయక్రాంతి): మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ఐటిడిఏ ప్రాంగణంలోని శివాలయంలోని శ్రీ జయ దుర్గ సహిత పంచముఖ విశ్వేశ్వర స్వామి వారిని ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి బి. రాహుల్ దంపతులు దర్శించుకున్నారు. బుధవారం నాడు శ్రీ జయ దుర్గ సహిత పంచముఖ విశ్వేశ్వర స్వామి వారి దర్శనానికి వచ్చిన ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి దంపతులకు ఆలయ అర్చక స్వాములు పిఓ దంపతుల చేత పాలాభిషేకాలు చేయించి ప్రత్యేక పూజలు చేయించారు. అనంతరం అర్చక స్వాములు స్వామివారి విశిష్టతను తెలిపి తీర్థప్రసాదాలు అందించారు. అనంతరం పిఓ మాట్లాడుతూ... మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని శ్రీ జయ దుర్గ సహిత పంచముఖ విశ్వేశ్వర స్వామి వారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో శివాలయం పూజారులు నీలకంఠ శర్మ, రవి తదితరులు పాల్గొన్నారు.