కలెక్టర్ జితేష్ వి పాటిల్...
భద్రాచలం (విజయక్రాంతి): ఐటీడీఏ కార్యాలయం క్యాంపస్ లో ఖాళీగా ఉన్న ప్రదేశాలలో చెత్తాచెదారం పేరుకుపోకుండా ఎప్పటికప్పుడు శుభ్రం చేసి సేంద్రియ ఎరువులకు సంబంధించిన గుంతలు నిర్మాణం చేపట్టి సేంద్రియ ఎరువులు తయారు చేసుకుంటే గిరిజన రైతులకు ఉపయోగపడుతుందని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. శుక్రవారం నాడు ఐటీడీఏ కార్యాలయంలోని పరిసరాలను ఆయన పరిశీలించిన అనంతరం మాట్లాడుతూ... ఐటిడిఏ పక్కన ఉన్న గ్రౌండ్లో వర్షం నీరు చేరకుండా ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకోవాలని, ఐటీడీఏ కార్యాలయంకు వచ్చే సందర్శకులు సేదా తీరడానికి పక్కనే ఉన్న పార్కును, ఐటీడీఏ క్యాంటీన్ సర్వ సుందరంగా ముస్తాబు చేయాలని అలాగే ఉద్యోగస్తులు పిల్లలు ఆడుకునే విధంగా బ్యాట్మెంటన్ కోర్టు ఏర్పాటు చేయాలని, ఐటీడీఏ నివాసగృహాల మరమ్మత్తులకు సంబంధించిన ప్రతిపాదనలు తయారుచేసి తనకు పంపించాలని అన్నారు.
అనంతరం రాశి వనం పార్క్, కలెక్టర్ క్యాంప్ ఆఫీస్, పి ఎమ్ ఆర్ సి కార్యాలయం, నాప్కిన్, మిల్లెట్ బిస్కెట్ యూనిట్, కోయబొమ్మల తయారీ కేంద్రమును సందర్శించి వివిధ రకాల డిజైన్లలో తయారు చేసే కోయ బొమ్మల శిక్షణ గిరిజన యువకులకు అందించి మార్కెటింగ్ సౌకర్యం కల్పించుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఐటిడిఏ పరిపాలన అధికారి రాంబాబు, ఏపీవో పవర్ వేణు, ఉద్యానవన అధికారి ఉదయ్ కుమార్, డిఎస్ఓ ప్రభాకర్ రావు, డిటిఆర్వోఎఫ్ఆర్ లక్ష్మీనారాయణ, జేడీఎం హరికృష్ణ, గ్రామపంచాయతీ ఈవో శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.