calender_icon.png 28 September, 2024 | 12:51 PM

అదానీ చేతికి ఐటీడీ సిమెంటేషన్?

21-09-2024 12:00:00 AM

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 20: అదానీ గ్రూప్ తమ సివిల్ ఇన్‌హౌజ్ ఇంజనీరింగ్ సామర్థ్యాల్ని పెంచుకునేందుకు  ఇంజనీరింగ్, కన్‌స్ట్రక్షన్ కంపెనీ ఐటీడీ సిమెంటేషన్ ఇండియాలో 46.64 శాతం వాటాను రూ. 5,888.57 కోట్లకు  కొనుగోలు చేయనున్న ట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఐటీడీ సిమెంటేషన్ పబ్లిక్ షేర్ హోల్డర్ల నుంచి మరో 26 శాతం వాటా కొనుగోలుకు ఓపెన్ ఆఫర్ జారీచేస్తుందని భావిస్తున్నారు. ఈ వార్త నేపథ్యంలో శుక్రవారం ఐటీడీ సిమెంటేషన్ షేరు 20 శాతం పెరిగి రూ.565 అప్పర్ సర్క్యూట్ వద్ద ఫ్రీజ్ అయ్యింది. ఈ అంశమై బీఎస్‌ఈ వివరణ కోరగా వాటాను విక్రయించే అవకాశాల్ని తమ ప్రమోటింగ్ సంస్థ ఇటాలియన్ థాయ్ డెవలప్‌మెంట్ పబ్లిక్ కంపెనీ అన్వేషిస్తున్నదని ఐటీడీ సిమెంటేషన్ తెలిపింది. అయితే ప్రస్తుతానికి ప్రతిపాదిత విక్రయం ఖరారు కాలేదని పేర్కొంది.