calender_icon.png 27 February, 2025 | 12:15 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఐటీసీ అండ.. జామాయిల్ రైతుల ఇంట పండుగ

26-02-2025 12:27:57 AM

  • 40 వేల హెక్టార్లలో మేలురకం జామాయిల్ సాగు చేస్తున్న రైతులు

కొత్త వంగడాలతో 20శాతం అధిక దిగుబడి

రైతులకు ప్రోత్సాహక అవార్డులు అందించిన 

ఐటీసీ డివిజనల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ రాజేష్ పొన్నూరు 

బూర్గంపాడు, ఫిబ్రవరి 25 : ఆసియా ఖండంలో అతిపెద్ద పేపర్ కర్మాగారంగా ఉన్నటువంటి ఐటిసి పిఎస్ పిడిలో ప్లాంటేషన్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో రైతు సదస్సును ఏర్పాటు చేశారు. ఈ సమావేశం లో జామాయిల్ పంటలో అత్యధిక దిగుబడి వచ్చిన రైతుల్ని గుర్తించి వారికి అవార్డులను అందజేశారు.

ఈ సమావేశంలో ఐటీసీ ఉన్న త అధికారులతో పాటు నాలుగు రాష్ట్రాల వ్యాప్తంగా ఉన్న పలువురు రైతులతో పాటు గా కృషి విజ్ఞాన కేంద్రం నుండి సైంటిస్ట్ లక్ష్మీ నరసమ్మ, ఆచార్య ఎన్జీరంగా విశ్వవిద్యాలయం నుండి ప్రొఫెసర్ రాంప్రసాద్ కూడా రైతు సదస్సులో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ప్లాంటేషన్ విభాగపు అధికారిణి  ఉషారాణి మాట్లాడుతూ  ఉన్నత వంగడాలతో సృష్టించిన క్లోనింగ్ మొక్కలు కోర్ క్లస్టర్ ఏరియాలో మొక్కను రెండు రూపాయలు అందించడం జరుగుతుందని, 250 కిలోమీటర్ల పరిధి ఉన్నవారికి మూడు రూపాయలకు అదే మొక్కను అందించడం జరుగుతుందని చెప్పారు.

ప్రపంచ నాణ్యత కలిగిన క్లోన్స్‌ను బెంగళూరు  ఐటీసీ ఎల్ ఎస్‌టిసి వారి ఆధ్వర్యంలో రూపొందించినటువంటి కొత్త వంగడాలను మాత్రమే రైతులుకి అందిస్తున్నట్లు  దీని ద్వారా దిగుబడి పెరిగే రైతులు ఆర్థికంగా అభివృద్ధి చెందుతున్నట్లు తెలిపారు.

రైతు సదస్సులో పలువురు రైతులని ఐటీసీ డివిజనల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ రాజేష్ పొన్నూరు ఘనంగా సన్మానించి వారికి ఐటిసి మేమెంటో అం దించారు. ఆచార్య జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం నుండి ప్రొఫెసర్ రాంప్రసాద్, కృషి విజ్ఞాన కేంద్రం కోఆర్డినేటర్ లక్ష్మీ నారాయణమ్మ  మాట్లాడారు. 

కార్యక్రమంలో ఐటీసి యూనిట్ హెడ్ శైలేంద్ర సింగ్ , ఐటీసీ యూనిట్ ఫైనాన్స్ హెడ్ రాజశేఖర్, ప్లాంటేషన్ జనరల్  మేనేజర్ జగదీష్ తమక్, ఐడిసి జీఎం హెఆర్ శ్యామ్ కిరణ్, విశ్వకర్మ, చంగల్ రావు, సురేష్ రెడ్డి ప్లాంటేషన్, రా మెటీరియల్  ఉన్నతాధికారులు పాల్గొన్నారు.