12-03-2025 01:10:28 AM
బూర్గంపాడు మార్చి 11 (విజయ క్రాంతి): ఒంటరి మహిళలకు ఐటిసి చేయూతనిచ్చి ఆర్థికంగా బలోపేతం కావడానికి దోహదపడటం హర్షదాయకమని పినపాక భద్రాచలం ఎమ్మెల్యేలు పాయం వెంకటేశ్వర్లు, తె ల్లం వెంకట్రావు, ఐటీడీఏ పీవో రాహుల్ కొనియాడారు.
మంగళవారం బూర్గంపాడు మండలం సారపాక ఐటిసి కళాభారతిలో నిర్వహించిన ఐటీసీ బంగారు భవిష్యత్తు అతి నిరుపేద సహాయ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పాల్గొన్నా వారు మాట్లాడుతూ ఐటిసి వారు నిర్వహిస్తున్న బంగారు భవిష్యత్తు అది నిరుపేద సహాయ కార్యక్రమం ద్వారా నిరుపేద మహిళలకు మెలకువలను నేర్పి వారికి అనేక రంగాలలో శిక్షణ ఇచ్చి వారు ఆర్థికంగా బలపడేందుకు పలు రకాల కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.
వర్షాకాలంలో వచ్చే వరదల కారణంగా అనేక గ్రామాలు ముంపునకు గు రైతే అక్కడ ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించి వేల మందికి భోజన వసతి సౌకర్యాలు ఏర్పాటు చేసి ముంపు గ్రామాల ప్రజలను ఆదుకోవడం, ఐ టి సి, సి ఎస్ ఆర్ నిధులతో అనేక గ్రామాల అభివృద్ధికి తోడ్పడ్డారని, బంధన్ ఐటిసి వారి సేవలు ఎంతో మంది మహిళలకు ఆదర్శంగా నిలిచాయన్నారు.భర్త లేని కుటుంబాల మహిళలకు వారి రెక్కల పై వారు నిలబడే భరోసా ఐటిసి సంస్థ వారు కల్పించారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఐ టి సి హెచ్ ఆర్ జి యం శ్యామ్ కిరణ్, ప్రజా ప్రతినిధులు, బూర్గంపాడు, భద్రాచలం, దుమ్మగూడెం, అశ్వాపురం కు చెందిన మహిళలు తదితరులు పాల్గొన్నారు.