calender_icon.png 29 April, 2025 | 2:53 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తలసేమియా, సికిల్సెల్ ఎనిమియా వ్యాధి నివారణకు ఐటిసి పిఎస్పిడి సహకారం

17-04-2025 06:41:58 PM

భద్రాచలం (విజయక్రాంతి): పుట్టుకతో వచ్చే తలసేమియా, సికిల్సెల్ ఎనిమీయా వ్యాధి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అధికంగా ఉన్నదని, ఈ వ్యాధితో బాధపడుతున్న వారికి రక్తం 20 రోజులకు ఒకసారి క్రమం తప్పకుండా ఎక్కించాల్సిన ఆవశ్యకత కలదని, అందుకని గిరిజనర సంక్షేమం, పేద ప్రజల సౌకర్యార్థం ఐటిసి పిఎస్పిడి సంస్థ ప్రత్యేక కార్యక్రమం చేపట్టినారు. ఈ వ్యాధి నివారణ, నిర్ధారణ పరీక్షల కొరకు, ఐటిసి పిఎస్పిడి సారపాక వారు రూ.5 లక్షల విలువ గల 1800 కిట్లు (పరికరాలను) ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ రక్తనిధి కేంద్రం భద్రాచలం వారికి శుక్రవారం అందజేశారు.

వ్యాధి నిర్ధారణ పరీక్షల కిట్స్ అందించిన ఐటిసి పిఎస్పిడి మిల్ యూనిట్ హెడ్ శైలేంద్రసింగ్, జనరల్ మేనేజర్ పి. శ్యామ్ కిరణ్, ప్రోగ్రాం ఆఫీసర్ డి. చెంగల్రావు కు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ భద్రాచలం ధన్యవాదాలు తెలుపుతూ శాలువాలతో సత్కరించినారు. ఈ కార్యక్రమంను ఇదేవిధంగా తదుపరి మూడు సంవత్సరాలు కొనసాగించవలెనని డా.ఎస్. ఎల్. కాంతారావు జిల్లా కోఆర్డినేటర్ గా కోరగా, వారు అందుకు తగు చర్యలు తీసుకుంటామని తెలిపినారు. 

అదేవిధంగా ఈ కార్యక్రమం నిర్వహణకు పూర్తిగా సహకారం అందించిన జిల్లా కలెక్టర్ జితేష్ వి.పాటిల్ కి కృతజ్ఞతలు తెలిపినారు. భద్రాచలంలోని ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ రక్తనిధి కేంద్రంలో ఉచితంగా తలసేమియా, సికిల్సెల్ ఎనిమీయా వ్యాధి నిర్ధారణ పరీక్షలను ఎలక్ట్రోపర్సీస్ పద్దతిలో నిర్వహిస్తామని, ప్రైవేట్ లేబరేటరీలలో రూ.2000లు పరీక్షలకు ఖర్చు అవుతుందని, ప్రజలు దీనిని సద్వినియోగం చేసుకోవాలని డా.ఎస్.ఎల్.కాంతారావు కోరినారు. ఈ కార్యక్రమంలో జిల్లా కోఆర్డినేటర్ డా.ఎస్.ఎల్.కాంతారావు, వై.సూర్యనారాయణ, జి. రాజారెడ్డి, వి.కామేశ్వరరావు, గోళ్ళ భూపతిరావు, పల్లంటి దేశప్ప, ఆదినారాయణ తదితరులు పాల్గొన్నారు.