ఉద్యోగ సంఘాల జేఏసీ చైర్మన్ లచ్చిరెడ్డి
హైదరాబాద్ సిటీబ్యూరో, సెప్టెంబరు 14 (విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా నిర్మించనున్న ఫ్యూచర్ సిటీలో ఉద్యోగులకు ఇళ్లస్థలాలు ఇప్పించేదుకు కృషిచేస్తానని ఉద్యోగ సంఘాల జేఏసీ చైర్మన్ వి.లచ్చిరెడ్డి అన్నారు. మేడ్చల్ జిల్లా తూంకుంటలోని ఓ ఫంక్షన్ హాల్లో శనివారం రెవెన్యూ శాఖ ఉద్యోగులు, టెక్నికల్ మేనేజర్లు, టైపిస్ట్ కమ్ కంప్యూటర్ ఆపరేటర్ల ఆధ్వర్యంలో తెలంగాణ ఉద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటీ సభ్యులు.. ఇటీవల చైర్మన్‌గా నియమితులైన వి.లచ్చిరెడ్డిని ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా లచ్చిరెడ్డి మాట్లాడుతూ.. హౌసింగ్ సొసైటీ ద్వారా ఉద్యోగులు అందరికీ ఇళ్లు, ఇళ్ల స్థలాలు ఇచ్చే ఆలోచన జేఏసీకి ఉందన్నారు. అందులో ప్రభుత్వ ఉద్యోగులతో పాటు కంప్యూటర్ ఆపరేటర్లు, టైపిస్ట్ లు కచ్చితంగా ఉంటారని అన్నారు.