15-04-2025 12:51:38 AM
మాజీ మంత్రి హరీశ్‌రావు
తెల్లాపూర్ బీరప్ప జాతరలో ప్రత్యేక పూజలు
పటాన్ చెరు, ఏప్రిల్ 14 :కురుమ జాతికి సముచిత స్థానం కల్పించింది కేసీఆర్ ప్రభుత్వమే అని మాజీ మంత్రి, సిద్ధిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు అన్నారు. రామచంద్రాపూర్ మండలం తెల్లాపూర్ మున్సిపాలిటీలో సోమవారం జరిగిన బీరప్ప జాతరకు హరీశ్ రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. స్థానిక నా యకులు, కురుమ సంఘం నేతలతో కలిసి బీరప్పను దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు.
అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో హరీశ్ రావు మాట్లాడుతూ బీఆర్‌ఎస్ అధికారంలో ఉన్న పది సంవత్సరాలు సీఎం కేసీఆర్ కురుమలకు సముచిత గౌరవం ఇచ్చారన్నారు. ఓ కురుమ వ్యక్తిని కొమురవెల్లి మల్లన్న దేవాలయ కమిటీ చైర్మన్ గా చేసిన ఘనత బీఆర్‌ఎస్ కే దక్కిందన్నారు. కురుమలకు ఎమ్మెల్సీ ఇచ్చి గౌరవించింది కూడా కేసీఆర్ అని గుర్తు చేశారు. కురుమల అభివృద్ధికి తాము ఎళ్లప్పుడూ అండగా ఉంటామని హామీ ఇచ్చారు. మల్లన్న సాగర్ విషయంలో ఎన్ని అడ్డంకులు వచ్చినా పూర్తి చేశామన్నారు.
తెల్లాపూర్‌లో మాజీ చైర్ పర్సన్ లలితా సోమిరెడ్డి చేసిన పోరాటం వల్లే కురుమలకు ఎకరా భూమి కేటాయించామని చెప్పారు. ఈ కార్యక్రమంలో కురు మ సంఘం స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ క్యామ మల్లేశం, మాజీ సర్పంచ్ సోమిరెడ్డి, బీఆర్‌ఎస్ నియోజకవర్గ కోఆర్డినేటర్ ఆదర్శ్ రెడ్డి, పటాన్ చెరు కార్పొరేటర్ మెట్టు కుమార్ యాద వ్, పీఏసీఎస్ చైర్మన్ బుచ్చిరెడ్డి, సీనియర్ నాయకులు బాల్ రెడ్డి, సత్యనారాయణ, దేవేందర్ యాదవ్, అంజయ్య, శ్రీకాం త్ గౌడ్, నర్సింహా, మాజీ కౌన్సిలర్లు తదితరులుపాల్గొన్నారు.