21-02-2025 12:55:39 AM
కాటారం (భూపాలపల్లి) : ‘నా భర్తను చంపిం చింది బీఆర్‌ఎస్ నేత, మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంక టరమణారెడ్డినే అని, ఆయన అనుచరులే ఈ దారుణానికి ఒడిగట్టారని మృతుడి భార్య, మాజీ కౌన్సిలర్ నాగవెల్లి సరళ ఆరోపించారు. తన భర్త మేడిగడ్డ బరాజ్ కుంగుబాటుపై కేసు పెట్టినందునే ఆయన్ను టార్గెట్ చేశారని, హత్య వెనుక బీఆర్‌ఎస్ నేతలు కేటీఆర్, హరీశ్‌రావు హస్తం ఉందన్నారు.
బుధవారం అర్ధరాత్రి ఆమె భూపాలపల్లి పట్టణంలోని చౌరాస్తాలో బంధువులు, కుటుంబ సభ్యు లు, మద్దతుదారులతో కలిసి ఆమె ఆందోళన చేపట్టారు. హంతకులను పట్టుకునేవర కు రాజాలింగమూర్తి అంత్యక్రియలు జరుపబోమని ధర్నాకు దిగారు.
వెంకటరమణా రెడ్డి ఆరు నెలల క్రితం తన జోలికి రావద్దని తన భర్తను బెదిరించాడని, తన భర్త అయినప్పటికీ వెంకటరమణారెడ్డి భూకబ్జాలను అడ్డుకున్నాడని, దీంతో వెంకటరమణారెడ్డి తన భర్త అడ్డు తొలగించుకోవాలని భావించారని, దీనిలో భాగంగానే హత్యకు పూనుకొన్నారని ఆరోపించారు.