calender_icon.png 23 December, 2024 | 6:13 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నల్లగొండను నాశనం చేసింది కాంగ్రెసోళ్లే

23-12-2024 12:58:55 AM

  1. జిల్లాకు కేసీఆర్ ఏం చేయలేదనడం విడ్డూరం 
  2. మాజీ ఎమ్మెల్యే కిశోర్ 

హైదరాబాద్, డిసెంబర్ 22 (విజయక్రాంతి): బీఆర్‌ఎస్ పాలనలో కే సీఆర్ నల్లగొండ జిల్లాకు ఏమీ చేయలేదని సీఎం రేవంత్, మంత్రి కోమటిరెడ్డి అనడం విడ్డూరంగా ఉందని మాజీ ఎమ్మె ల్యే కిశోర్ పేర్కొన్నారు. ఆదివారం తెలంగా ణ భవన్‌లో ఎమ్మెల్సీ కోటిరెడ్డి, మాజీ ఎమ్మె ల్యే భిక్షమయ్య, ప్రభాకర్‌రెడ్డితో కలిసి మీడియాతో మాట్లాడారు.

రాష్ర్టంలోనే అత్యధిక పంట నల్లగొండ జిల్లాలో పండుతోందని, కాంగ్రెస్ నేతలే ఆ జిల్లాను నాశనం చేశారని మండిపడ్డారు. ఆంధ్రా నేతల మోచేతి నీళ్లు తాగే కాంగ్రెస్ నేతలకు ఒకరంటే ఒకరికి పడదని, వచ్చే ఎన్నికల్లో వారంతా శంకరగిరి మాణ్యాలు పట్టడం ఖాయమన్నారు. కోమటిరెడ్డి నాలుగుసార్లు ఎ మ్మెల్యేగా గెలిచి నల్లగొండ లో ఒక్క రోడ్డు కూడా వే యలేదన్నారు.

తుంగతుర్తి కి కాళేశ్వరం నీళ్లు తీసుకొచ్చామనే విషయంలో చ ర్చకు తాను సిద్ధంగా ఉ న్నానన్నారు. రోడ్లు, భవనాల శాఖ మంత్రిగా కోమటిరెడ్డి ఏడాదిలో ఒక్కసారి కూడా నల్లగొండ రోడ్లపై సమీక్ష చే యలేదని విమర్శించారు. మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డిపై సీఎం ఇష్టనుసారంగా మాట్లాడు తున్నాడని, బీఆర్‌ఎస్ నేతలను తిడితే కార్యకర్తలు చూస్తూ ఊరుకోరని స్పష్టం చేశారు.

ఉమ్మడి నల్లగొండ జిల్లాకు కేసీఆర్ మూడు కొత్త జిల్లాలు, మూడు మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేసినట్టు గుర్తుచేశారు. అనంతరం మాజీ ఎంపీ లింగయ్యయాదవ్ మాట్లాడుతూ కేసీఆర్ నల్లగొండ జిల్లాలో ఫ్లోరైడ్ లేకుండా చేశారని గుర్తు చేశారు.