calender_icon.png 3 April, 2025 | 1:45 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మా జీవితాల్లో వెలుగులు నింపింది కాంగ్రెస్ ప్రభుత్వమే..

01-04-2025 08:49:27 PM

జిల్లా ట్రాన్స్ జెండర్స్ అధ్యక్షురాలు రూప..

కాటారం (విజయక్రాంతి): మా బతుకుల్లో వెలుగులు నింపింది కాంగ్రెస్ ప్రభుత్వమేనని జయశంకర్ భూపాలపల్లి జిల్లా ట్రాన్స్ జెండర్స్ అధ్యక్షురాలు ఏ రూప విస్పష్టంగా ప్రకటించారు. మంగళవారం నాడు విలేకరులతో మాట్లాడుతూ... గత ప్రభుత్వం మా ట్రాన్సజెండర్స్ ను పట్టించుకోలేదని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంథని నియోజకవర్గం శాసనసభ్యులు, ఐటీ మంత్రి శ్రీధర్ బాబు మాకు అనేక ఉపాధి అవకాశాలు కల్పిస్తూ, సమాజంలో గౌరవంగా బతికేందుకు సహాయ పడుతున్నారని వారు అన్నారు.

మాకు హైదరాబాద్ సిటీలో ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా ఉద్యోగ అవకాశాలు కల్పించారని, అలాగే మహాలక్ష్మి పథకం కింద ఆర్టీసీ బస్సులలో ఉచిత ప్రయాణం కల్పిస్తున్నారని ఆనందంతో తెలిపారు. ఈ ప్రభుత్వం అనేక విధాలుగా మాకు సహాయ పడుతున్న విషయాలను మంత్రి శ్రీధర్ బాబు మా ట్రాన్సజెండర్ విషయాలను ప్రస్తావన తీసుకువచ్చినప్పుడు బీఆర్ఎస్ శాసనసభ్యులు వెకిలి చేష్టలు చేస్తూ నవ్వడం మా మనోభావాలను దెబ్బ తీశాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ శాసనసభ్యులు  మొన్న జరిగిన శాసన సభలో చేసిన వెకిలి చేష్టలకు ట్రాన్సజెండర్స్ నిరసన వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ శాసనసభ్యులు తక్షణమే ట్రాన్సజెండర్స్ కు బేషరతుగా క్షమాపణలు చెప్పాలని, లేకుంటే రాష్ట్రవ్యాప్తంగా ధర్నాలు చేపడతామని ట్రాన్సజెండర్ జిల్లా అధ్యక్షురాలు రూప తెలిపారు. ఈ కార్యక్రమంలో శాన్విత, ఫ్రూటీ, నిత్య, శానిష్ఠ, రస్నా, వారోడిని తదితరులు పాల్గొన్నారు.