calender_icon.png 1 March, 2025 | 2:18 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మానవునికి ఆధునికత వైపు అడుగులు వేయించింది దర్జీలే

28-02-2025 10:19:58 PM

వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించుకొని ఆర్థికాభివృద్ధి సాధించాలి..

సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కే సాబీర్ పాషా..

కొత్తగూడెం (విజయక్రాంతి): ఆది మానవున్నీ తన నైపుణ్యంతో ఆధునికతవైపు అడుగులు వేయించింది దర్జీలేనని, వారికి తగిన గుర్తింపు ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉందని సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా అన్నారు. టైలర్స్ డే సందర్బంగా శుక్రవారం రామవరం సెంటర్లో ఏర్పాటు చేసిన ఉత్సవంలో పాల్గొని టైలర్లకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ... వృత్తులపై ఆధారపడి జీవిస్తున్నపేద వర్గాలు తమ వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించుకొని ఉన్నతంగా ఎదగాలని అన్నారు.

వస్త్ర వ్యాపారంలో కార్పొరేట్ సంస్థలు అడుగుపెట్టడంతో టైలర్లకు ఉపాధి కరువవుతుందని అన్నారు. రెడీమేడ్ దుస్తుల ప్రవేశంతో టైలర్ వృత్తి కనుమరుగయ్యే పరిస్థితి ఏర్పడుతోందని అన్నారు. ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా టైలర్లు ఆధునికతవైపు అడుగులు వేయాలని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం టైలర్ వృత్తిదారులకు వడ్డీలేని బ్యాంకు రుణాలు, ఆధునిక పరికరాలు అందించాలని కోరారు. కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు కంచర్ల జమలయ్య, టైలర్లు నర్సింహరావు, పురుషోత్తం, బ్లూ మూన్ తదితరులు పాల్గొన్నారు.