calender_icon.png 20 January, 2025 | 1:13 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భూకంపం కాదది.. భారీ పేలుడు

17-12-2024 01:09:50 AM

సిరియాపై ఇజ్రాయెల్ వైమానిక దాడులు

పేలుళ్ల ధాటికి పలుచోట్ల భూప్రకంపనలు

డమాకస్, డిసెంబర్ 16:  సిరియాలోని కీలక నగరమైన టార్టస్‌పై ఇజ్రాయె ల్ గగనతలం నుంచి వైమానిక దాడులకు పాల్పడింది. దాడుల కారణంగా భూప్రకంపనలు వచ్చి రిక్టర్ స్కేలుపై 3.0 పా యింట్లు నమోదైందంటే దాడులు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. భూప్రకంపనలు వచ్చినందున సిరియాపౌరులు భూకంపం వచ్చిందని భావించా రు. కానీ.. పేలుడు వల్ల సంభవించిన ప్రకంపనలని అక్కడి అధికారులు స్పష్టం చేశారు.

ఇజ్రాయెల్ వైమానిక దాడులను ‘ఓఎస్‌ఐఎన్టీ డిఫెండర్ ’ నిర్ధారించింది. పేలుడు కారణంగా ఇస్నిక్ కేంద్రంగా ప్రకంపనలు ప్రారంభమయ్యాయి. అక్కడి నుంచి భూకంపం కంటే రెండు రేట్ల వేగం తో ఇతర ప్రాంతాలకు వ్యాపించాయి. భూమి నుంచి పైకి రెండు కిలోమీటర్ల మేర అగ్నిగోళం ఏర్పడింది. 2012 నుంచి ఇప్పటివరకు సిరియాపై ఇజ్రాయెల్ చేసిన దాడు ల్లో ఇదే అతిపెద్దదని నిపుణులు పేర్కొంటున్నారు.