విశ్వక్‌సేన్ అప్ కమింగ్ యూత్‌ఫుల్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘లైలా’. రామ్ నారాయణ్ దర్శకత్వంలో షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి నిర్మించారు. ఆకాంక్ష శర్మ కథానాయికగా నటిస్తున్న ఈ సినిమా ఫిబ్రవరి 14న ప్రేమికుల రోజున విడుదలకు సిద్ధమవుతోంది. దీంతో మేకర్స్ మూవీ ప్రమోషన్స్‌ను జోరుగా నిర్వహిస్తున్నారు. సోను మోడల్‌గా, లైలాగా విశ్వక్‌సేన్ రెండు డిఫరెంట్ లుక్స్ బజ్ క్రియేట్ చేశాయి.
ఈ చిత్రం నుంచి విడుదలైన ఫస్ట్ సింగిల్‌కు కూడా మంచి స్పందనను వచ్చింది. తాజాగా శుక్రవారం మేకర్స్ మూవీ టీజర్‌ను రిలీజ్ చేశారు. ఇందులో విశ్వక్ సోను మోడల్‌గా, లైలాగా డిఫరెంట్ పర్సనాలిటీల్లో కనిపించి, నవ్వించారు. సిటీలో బ్యూటీ పార్లర్ నిర్వహించే సోను మోడల్ స్థానిక మహిళలతో మాట్లాడటం అక్కడి మగవాళ్లకు నచ్చకపోవటం, సోను చరిష్మా అతన్ని ఇబ్బందుల్లోకి నెట్టేయడం వంటి పరిస్థితుల్లో లైలాగా మారడం ఆసక్తిగా ఉంది. ఈ చిత్రానికి రచన: వాసుదేవ మూర్తి; సంగీతం: లియోన్ జేమ్స్; సినిమాటోగ్రఫీ: రిచర్డ్ ప్రసాద్; ఆర్ట్ డైరెక్టర్: బ్రహ్మ కడలి.