calender_icon.png 5 December, 2024 | 12:56 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మంచి కంటెంట్‌తో రావడం ఆనందాన్నిచ్చింది

04-12-2024 12:00:00 AM

తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌తో రూపొందిన మొట్టమొదటి డిటెక్టివ్ వెబ్ సిరీస్‌గా ఓటీటీ ప్లాట్‌ఫామ్‌కు వచ్చింది ‘వికటకవి’. రైటర్ తేజ దేశ్‌రాజ్ కథను అందించగా.. నరేశ్ అగస్త్య, మేఘా ఆకాశ్ ప్రధాన పాత్రల్లో డైరెక్టర్ ప్రదీప్ మద్దాలి తెరకెక్కించారు. ఎస్‌ఆర్‌టీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై ప్రొడ్యూసర్ రామ్ తాళ్లూరి నిర్మించిన ఈ సిరీస్ నవంబర్ 28 నుంచి జీ5లో స్ట్రీమింగ్ అవుతోంది. విడుదలైన కొన్ని గంటల్లోనే సిరీస్ ప్రేక్షకాదరణ పొందుతోందని పేర్కొంటూ సిరీస్ టీమ్ మంగళవారం సక్సెస్ మీట్ నిర్వహించింది.

ఈ సందర్భంగా దర్శకుడు ప్రదీప్ మద్దాలి మాట్లాడుతూ.. “వికటకవి’ సిరీస్ విడుదలైన కొన్ని గంటల్లోనే 100 మిలియన్స్ స్ట్రీమింగ్ మినిట్స్‌ను చేరుకోవటం చాలా సంతోషాన్నిచ్చింది. ఈ జర్నీలో నాకు అండగా నిలిచిన టీమ్‌కు థాంక్స్‌” అని తెలిపారు. ‘మంచి కంటెంట్ ఉన్న సిరీస్‌ను ప్రేక్షకులకు అందించినందుకు చాలా ఆనందంగా ఉంది’ అని హీరో నరేశ్ అగస్త్య తెలిపారు. రైటర్ తేజ దేశ్‌రాజ్, నిర్మాత రజనీ తాళ్లూరి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ సాగర్, మ్యూజిక్ డైరెక్టర్ అజయ్ అరసాడ, రఘు కుంచె తదితరులు పాల్గొన్నారు.