అశోక్ గల్లా, మానస వారణా సి జంటగా రూ పొందిన చిత్రం ‘దేవకి నందన వాసుదే వ’. ప్రశాంత్ వర్మ కథ అందించిన ఈ చిత్రాన్ని అర్జున్ జంధ్యాల తెరకెక్కించారు. నల్లపనేని యామిని సమర్పణలో లలి తాంబిక ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సోమినేని బాలకృ ష్ణ నిర్మించారు. నవంబర్ 22న ఈ సినిమా థియేటర్లలోకి రానుంది. ఈ సందర్భంగా హీ రోయిన్ మానస వారణాసి విలేకరుల సమా వేశంలో సినిమా విశేషాలను పంచుకున్నారు.
మీ నేపథ్యం గురించి చెప్పండి?
-నేను హైదరాబాదులోనే పుట్టాను. టెన్త్ క్లాస్ వరకు మలేషియాలో చదువుకున్నాను. హైదరాబాదులో ఇంజనీరింగ్ చేశాను. కార్పొరేట్లో జాబ్ చేశాను. మిస్ ఇండియా టైటిల్ గెలిచాను. మూవీ వర్క్ షాప్స్ కి వెళ్లినప్పుడు సినిమా మీద పాషన్ పుట్టింది. ఇది నాకు కొత్త ప్రపంచం.
ఇందులో మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతోంది?
-నా క్యారెక్టర్ పేరు సత్యభామ. తను విజయనగరం అమ్మాయి. ఈ సినిమా విజయనగరం బ్యాక్ డ్రాప్‌లో ఉంటుంది. సత్యభామ ఎలాంటి కష్టం వచ్చినా ధైర్యంతో నిలబడే అమ్మాయి. కథలో నాది కీ రోల్.
తొలి సినిమా కదా.. మీరు ఎలాంటి ఛాలెంజెస్ ఎదుర్కొన్నారు?
-ఫస్ట్ మూవీ ఎప్పుడూ ఛాలెంజింగ్‌గానే ఉంటుంది. సెట్స్‌లో వాడే పదాలు, డైరెక్టర్ వాడే పదాలు, సిని మా లాంగ్వేజ్ వీటన్నిటినీ అన్ స్పాట్ నేర్చుకోవాలి. ఇది రోలర్ కోస్టర్ లాంటి రైడ్. నాకు బిగ్ లెర్నింగ్ ఎక్స్ పీరియన్స్. చాలా విషయాలు నేర్చుకున్నాను.
అశోక్‌తో వర్కింగ్ ఎక్స్ పీరియన్స్ గురించి ?
-అశోక్ వెరీ ప్రొఫెషనల్. సినిమా అంటే చాలా పాషన్. మహేష్ గారి దగ్గర నుంచి ఆయన నేర్చుకున్న విష యాలు చెప్పేవారు.
ఈ కథలో మీకు నచ్చిన ఎలిమెంట్ ఏమిటి ?
-చాలా ఇంట్రెస్టింగ్ స్టోరీ ఇది. ఒక డెబ్యు యాక్టర్‌కి ఇలాంటి కథ, క్యారెక్టర్ రావడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను. సత్యభామ క్యారెక్టర్ ఎప్పటికీ గుర్తుం డిపోతుంది.