- బీసీలు ఇక ఓటు బ్యాంకుగా ఉండరు..
- 2028 ఎన్నికల్లో బీసీ వ్యక్తే ముఖ్యమంత్రి
- రేవంత్‌రెడ్డి చిట్టచివరి ఓసీ సీఎం
- ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న
- హనుమకొండలో ‘బీసీ రాజకీయ యుద్ధభేరి బహిరంగ సభ’
జనగాం, ఫిబ్రవరి 2 (విజయక్రాంతి): ‘నిన్నటి దాకా ఒక లెక్క.. ఇప్పుడొక లెక్క. ఇక నుంచి బీసీలు ఓటు బ్యాంకుగా ఉండరు. ఆధిపత్య కులాల పప్పులు ఉడకవు’ అని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న పేర్కొన్నారు. హనుమకొండలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీలో ఆదివారం నిర్వహించిన ‘బీసీ రాజకీ య యుద్ధభేరి బహిరంగ సభ’లో ఆయన మాట్లాడారు.
్థనిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 రిజర్వేషన్లు అమలు చేయాలని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న డిమాండ్ చేశారు. కరీంనగర్ నిజామాబాద్ ఆదిలాబాద్ కాంగ్రె స్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా నరేందర్‌రెడ్డిని అధిష్ఠానం ప్రకటించడాన్ని ఆయన తప్పుబట్టారు. కాంగ్రెస్ పార్టీకి దమ్ముంటే బీసీలను ఓట్లడకుండా నరేందర్‌రెడ్డిని గెలిపించుకోవాలని సవాల్ విసిరారు.
ఈడబ్ల్యూఎస్ రిజ ర్వేషన్లు అశాస్త్రీయమని అభిప్రాయపడ్డారు. ప్రభుత్వం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లను రద్దు చేయకుంటే వెనుకబడిన వర్గాలు ప్రభుత్వాన్ని రద్దు చేస్తారని హెచ్చరించారు. బీసీల జనాభా తేల్చేందుకు పాలకులకు 90 ఏళ్లు పట్టిందని, బీసీలంతా కలిసి నాలుగేళ్లలో అగ్రవర్ణాల లెక్కలు తెలుస్తారని హెచ్చరించారు.
బీసీల వద్ద లెక్క లేనంత డబ్బు ఉందని, అవసరమైతే రేపటికి రేపు బీఆర్‌ఎస్‌ను కొనే శక్తి బీసీలకున్నదని అభిప్రా యపడ్డారు. బీసీలు ఏడాదికి ప్రభుత్వానికి రూ.10 వేల కోట్ల ఆదాయం తీసుకొస్తున్నారని, పైసలు బీసీలు జమ చేస్తుంటే అగ్రవర్ణాలు రాజకీయ పీఠాలపై కూర్చుంటు న్నారని మండిపడ్డారు.
బీసీలు అధిక ఆదాయం ఇస్తూ బిచ్చగాళ్లలా రేషన్‌కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు అడిగే పరిస్థితి నెలకొన్నదని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో లక్ష మంది జనాభా అయినా లేని వెలమల్లో 13 మంది ఎమ్మెల్యేలయ్యారని తెలిపారు. పిడికెడు జనాభా లేని రెడ్డలలో 60 మంది ఎమ్మెల్యేలు ఉండడం దేనికి సంకేతమని ప్రశ్నించారు.
తెలంగాణలో బీసీలంతా ఏకం అవుతున్నారని, ఇక బీసీలదే రాజ్యాధికారమని జోస్యం చెప్పారు. 2028లో ముఖ్య మంత్రి కాబోయేది బీసీ బిడ్డేనని, రేవంత్‌రెడ్డి చిట్టచివరి ఓసీ సీఎం అన్నారు. రెడ్లు, వెలమల ఓట్లు తమకొద్దని, కానీ.. బీసీల ఓట్లు వద్దనే దమ్ము వారికి ఉందా? అని సవాల్ విసిరారు. జాతీయ బీసీ సంఘం అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య మాట్లాడుతూ.. కాంగ్రెస్ ఎన్నికల ముందు బీసీలకు ఇచ్చిన హామీలు నెరవేర్చకుంటే మున్ముందు పెద్దఎత్తున ఉద్యమాలు చేస్తామని హెచ్చరించారు.
పోరాటాలతోనే బీసీల రాజకీయ సాధికారత, ఆర్థిక ప్రగతి సాధ్యపడుతుందన్నారు. బీసీలంతా ఒక్కటై ఐక్య ఉద్యమ కార్యాచరణ అమలు చేయాలని పిలుపునిచ్చారు. బీసీల హక్కుల కోసం కేంద్ర, రాష్ట్ర్ర పభుత్వాలపై ఒత్తిడి తీసుకురావాల్సి ఉందన్నారు. రాష్ట్రంలోనే అత్యధికంగాఉన్న బీసీల కు ముఖ్యమంత్రి పీఠం దక్కకపోవడం బా ధాకరమన్నారు.
రాష్ట్రప్రభుత్వం బీసీ బంధు పథకం పెట్టి ప్రతి బీసీ కుటుంబానికి రూ.20 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. బీసీ కమిషన్ మాజీ చైర్మన్ కృష్ణమోహన్‌రావు మాట్లాడుతూ.. బీసీ కులగణన డేటాను కాంగ్రెస్ ప్రభుత్వం తారుమారు చేసిందని ఆరోపించారు.
బీసీ రిజర్వేషన్లు తక్కువగా అమలు చేస్తే రాష్ట్రంలో తిరుగుబాటు తప్పదన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పట్టభద్రులు బీసీ అభ్యర్థులనే గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. సభలో మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు, ప్రముఖ గేయ రచయిత మిట్టపల్లి సురేందర్ పాల్గొన్నారు.