calender_icon.png 23 January, 2025 | 3:30 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గొడవలు చేస్తోంది బీఆర్‌ఎస్ వాళ్లే!

23-01-2025 12:52:27 AM

  1. 3,410 గ్రామాల్లో సభలు నిర్వహించాం
  2. 142 గ్రామాల్లోనే ఆందోళనలు
  3. మీడియాతో చిట్‌చాట్‌లో మంత్రి సీతక్క

హైదరాబాద్, జనవరి 22 (విజయక్రాంతి): బీఆర్‌ఎస్ పాలనలో వారి ఎమ్మె ల్యేలు చెప్పినోళ్లకో పథకాలు అందేవని, ఫాంహౌజ్‌లలో లబ్ధిదారుల జాబితాలు త యారయ్యేవని, కానీ ప్రజాప్రభుత్వంలో అర్హులైనవారిని ప్రజల సమక్షంలోనే ఎంపిక చేస్తున్నట్లు మంత్రి సీతక్క పేర్కొన్నారు. పదేండ్ల తర్వాత రాష్ట్రంలో గ్రామసభలు జరుగుతున్నాయని ఆమె చెప్పారు.

గ్రామసభల్లో ఆందోళనలు చేస్తున్నది బీఆర్‌ఎస్ వాళ్లేనని తెలిపారు. సచివాలయంలో మీడియాతో మంత్రి సీతక్క బుధవారం చిట్ చా ట్ చేశారు. మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా 3,410 గ్రామాల్లో గ్రామసభలు నిర్వహించామని, కేవలం142 గ్రామాల్లోనే ఆందోళనలు జరిగాయన్నారు. అది కూడా బీఆర్‌ఎస్ నాయకులు కావాలనే గ్రామాల్లో గొడవలు సృష్టించారని విమర్శించారు.

మిగిలిన గ్రామాల్లో ప్రశాంత వాతావరణంలో సభలు జరిగినట్టు మంత్రి చెప్పారు. ప్రజాస్వామ్యబద్ధంగా లబ్ధిదారుల ఎంపిక జరుగుతుంటే బీఆర్‌ఎస్ నాయకులు కావాలనే రాద్ధాంతం చేస్తున్నారని మండిపడ్డారు. పదేండ్లుగా బీఆర్‌ఎస్ రేషన్‌కార్డులు ఇవ్వలేదని తెలిపారు.