calender_icon.png 4 February, 2025 | 2:26 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భారీ యాక్షన్ ఎపిసోడ్‌తో ప్రారంభిస్తారట..

03-02-2025 11:39:47 PM

ప్రముఖ కథానాయకుడు రజినీకాంత్ వరుసగా సినిమాలను లైన్‌లో పెడుతున్నారు. ప్రస్తుతం ఆయన నటిస్తున్న ‘కూలీ’ చిత్రం ముగింపు దశకు చేరుకుంది. ఇది పూర్తవగానే ఆయన ‘జైలర్ 2’ షూటింగ్‌లో పాల్గొననున్నారని సమాచారం. ‘జైలర్’ చిత్రం ఎంత పెద్ద సక్సెస్ సాధించిందో తెలియనిది కాదు. ఈ చిత్రానికి సీక్వెల్ కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. దీంతో చిత్రంపై అంచనాలు భారీగా పెరిగాయి. ఇప్పటికే ‘జైలర్ 2’ను చిత్రబృందం అధికారికంగా ప్రకటించేసింది.

మార్చి మధ్య నుంచి ఈ చిత్రం ప్రారంభం కావచ్చని సమాచారం. తొలి షెడ్యూల్‌లో భారీ యాక్షన్ సన్నివేశాలను కళానిధి మారన్ తెరకెక్కించనున్నారని తెలుస్తోంది. దీనికోసం ప్రత్యేక సెట్లను సైతం రూపొందుస్తున్నారని సమాచారం. ఈ చిత్రంలో రజినీ లుక్ కూడా ఆకట్టుకునేలా ఉంటుందని టాక్.