12-02-2025 01:37:52 AM
మహబూబ్ నగర్, ఫిబ్రవరి 11 (విజయ క్రాంతి) : చేసిన మంచి నీ చరిత్ర స్మరించు కుంటుందని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ెున్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. మంగళవారం మహబూబ్ నగర్ నియోజకవర్గంలో తెలు గు గూడెం నందు రూ.1 కోటి నిర్మించనున్న బీటీ రోడ్డు పనులకు శంకుస్థాపన, బొక్కలో నిపల్లి గ్రామంలోని పాఠశాలలో డ్యూయల్ డెస్క్ బెంచీలు, ర్యాకులు, కుర్చీలు, కంప్యూ టర్ విభాగాన్ని ప్రారంభించడం తో పాటు జిల్లా జనరల్ హాస్పిటల్ నందు మహిళా సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన రూ 5 భోజన కార్యక్రమాన్ని,
శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో జరుగుతున్న బ్రహ్మోత్స వ వేడుకలకు హాజరై స్వామివారికి పట్టు వస్త్రాల సమర్పణ, పత్తి పూర్ నుంచి భవాని తండా వరకు రూ కోటి 70 లక్షలతో, పద్య పూర్ నుంచి వడ్డె గుడిసెల వరకు రూ 90 లక్షల తో నిర్మించనున్న బీటీ రోడ్డు పనుల కు, ఎస్సీ వర్గీకరణ స్వాగతిస్తూ మాజీ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పిడమర్తి రవి ఆధ్వ ర్యంలో ఏర్పాటుచేసిన కార్యక్రమానికి ఎమ్మె ల్యే హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఈ కార్యక్రమంలో ఉద్దేశించి ఎమ్మెల్యే మాట్లా డుతూ ప్రజల సంక్షేమ కోసం రాత్రి పగలు భేదం లేకుండా శ్రమించేందుకు చాలా సి ద్ధంగా ఉన్నానని తెలిపారు. ఎప్పుడు ఎవరికీ ఆపద వచ్చిన అందుబాటులో ఉండి సేవ చేస్తానని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, గ్రంధాలయ చైర్మన్ మల్లు నరసింహారెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ బెక్కరి అనిత మధుసూదన్ రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ ఆనంద్ గౌడ్, డిసిసి ప్రధాన కార్యదర్శి సిరాజ్ ఖాద్రీ తదితరులు ఉన్నారు.