17-12-2024 01:33:06 AM
* కాంగ్రెస్ శ్రేణులకు మంత్రి పొన్నం పిలుపు
హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 16 (విజయక్రాంతి): జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బల్దియాను కైవసం చేసుకోవడమే లక్ష్యంగా పనిచేయాలని హైదరాబాద్ జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేశా రు. హైదరాబాద్ నగర కాంగ్రెస్ పార్టీ సమావేశం సోమవారం గాంధీ భవన్‌లో జరి గింది. ఈ సమావేశంలో మంత్రి పొన్నం ప్రభాకర్‌తో పాటు పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్, మేయర్ గద్వాల విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మం త్రి పొన్నం ప్రభాకర్ మట్లాడుతూ గ్రేటర్ హైదరాబాద్ నగరంలో క్షేత్ర స్థాయి లో పనిచేసే నాయకులకే తగిన గుర్తింపు, ప్రాధాన్య త ఉంటుందన్నారు. డివిజన్ స్థాయిలలో ప్రజల మధ్యనే ఉండి ప్రజలతో మమేకమైన బలమైన నాయకులకే టికెట్లు వస్తాయన్నా రు. ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని సూచించారు.