రామగుండం సీపీ శ్రీనివాసులు...
మంచిర్యాల (విజయక్రాంతి): పత్రికలు ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిగా నిలబడాలని, సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారానికి కృషి చేయాలని రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాసులు అన్నారు. గురువారం కమిషనరేట్‌లో తన ఛాంబర్‌లో ‘విజయక్రాంతి’ తెలుగు దినపత్రిక 2025 నూతన సంవత్సర క్యాలెండర్ మంచిర్యాల స్టాఫ్ రిపోర్టర్ ముత్యం వెంకటస్వామితో కలిసి ఆవిష్కరించిన అనంతరం ఆయన మాట్లాడారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను నాయకులు, అధికారుల దృష్టికి తీసుకెళ్లడమే కాకుండా వాటి పరిష్కారానికి తమవంతు బాధ్యతగా నిలవాలని కోరారు. ఈ కార్యక్రమంలో విజయక్రాంతి విలేకరులు ఆకుల శివ ప్రసాద్, విజయ్ కుమార్, వేణు గోపాల్ తదితరులు పాల్గొన్నారు.